ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే హజ్ ఆఫీసు బౌండరీ వాల్‌కి కాషాయ రంగు పెయింట్ వేయాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో ఆ ప్రభుత్వం వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రభుత్వం అది ఆరోపణ మాత్రమే అని.. తాము అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని ప్రకటించింది. తాజాగా ఇదే ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. లక్నోలోని గోమతినగర్ ప్రాంతంలో ఉన్న పార్కుల గేట్లకు, డివైడర్లకు కాషాయరంగు వేయాలని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మతవిశ్వాసాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న సిగ్నల్ జనాలకు ఇలా చేయడం వల్ల వెళ్లే అవకాశం ఉందని.. ఆదిత్యానాథ్ తన వైఖరి మార్చుకోవాలని పలువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హజ్ ఆఫీసు గేటుకి కాషాయ రంగు వేసినప్పుడే పలువురు ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు తగిలారు. ఈ క్రమంలో హజ్ కమిటీ సెక్రటరీ ఆర్పీ సింగ్ కూడా తన పదవిని కోల్పోవలసి వచ్చింది. చిత్రమేంటంటే.. యూపీలో సీఎం ఆఫీసు గేట్లకు, తలుపులకు కూడా కాషాయ రంగే వేశారు అధికారులు