తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తత

ఈశాన్య రాష్ట్రంలో త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేత ఘటన మరువక ముందే, తమిళనాడులోని తిరుపత్తూర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో పెరియార్ విగ్రహంపై దుండగులు దాడి చేశారు.

Last Updated : Mar 7, 2018, 01:36 PM IST
తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తత

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేత ఘటన మరువక ముందే, తమిళనాడులోని తిరుపత్తూర్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో పెరియార్ విగ్రహంపై దుండగులు దాడి చేశారు. 'ఇవాళ త్రిపురలో లెనిన్, రేపు కుల తీవ్రవాది రామస్వామి నాయకర్' అంటూ ట్విట్టర్ ద్వారా బీజేపీ నేత హెచ్ రాజా వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో వెల్లూరు జిల్లాలో ఓ పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు.

దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. తిరుపత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి గత రాత్రి 9 గంటల సమయంలో ఆందోళనకారులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం కళ్లు, ముక్కు దెబ్బతిన్నాయని, ఓ బీజేపీ కార్యకర్త, మరో సీపీఐ కార్యకర్త మద్యం మత్తులో ఈ పని చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసంపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఉదయం నిరసనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. కోయంబత్తూర్ బీజేపీ ఆఫీసుపై నిరసనకారులు దాడికి తెగబడ్డారు.

Trending News