జియో ఆఫర్లకు "ఎయిర్ టెల్" షాక్

  

Last Updated : Nov 5, 2017, 07:07 PM IST
జియో ఆఫర్లకు "ఎయిర్ టెల్" షాక్

ఇప్పటి వరకూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న జియా టెలికామ్‌‌కు పోటీగా మరో మెగా ఆఫర్ అందించి ఎయిర్ టెల్ అందరినీ ఆశ్యర్యపరిచింది.

తన ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం భారీ డేటా ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్ టెల్, 360 రోజుల కాలపరిమితి గల ఆఫర్‌తో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఈ ఆఫర్‌లో 300 జీబీ 4జీ డేటాను అందిస్తోన్న ఎయిర్ టెల్ అపరిమిత ఉచిత్ వాయిస్ కాల్స్‌‌తో పాటు రోజుకు 100 ఫ్రీ ఎస్సెమ్మెస్‌లు కూడా అందిస్తోంది.

రూ.3999 రూపాయలతో రీఛార్జి చేసుకోవడం వల్ల ఈ ఇయర్లీ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ లెక్కన నెలకు 334 రూపాయలను వినియోగదారుడు చెల్లించినట్లవుతుంది.

అలాగే నెలకు 25 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ కూడా పొందచ్చు. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు నెలవారీ ఆఫర్లు అందిసోన్న విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా ఎయిర్ టెల్ వార్షిక ఆఫర్ తీసుకురావడం విశేషం. ఈ ఆఫర్ ద్వారా జియోకి చెక్ పెట్టాలని భావిస్తోంది ఎయిర్ టెల్. 

Trending News