Amazon free coaching: జేఈఈ వరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్న అమెజాన్ అకాడమీ

Amazon free coaching: జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..అమెజాన్ మీకు శుభవార్త అందిస్తోంది. ఐఐటీ జేఈఈ కోర్సులకు ప్రిపేర్ అయ్యే విద్యార్దులకు అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2021, 04:32 PM IST
Amazon free coaching: జేఈఈ వరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్న అమెజాన్ అకాడమీ

Amazon free coaching: జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..అమెజాన్ మీకు శుభవార్త అందిస్తోంది. ఐఐటీ జేఈఈ కోర్సులకు ప్రిపేర్ అయ్యే విద్యార్దులకు అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలంటే..

అమెజాన్..కేవలం ఆన్‌లైన్ ట్రేడింగ్ కోసమే కాదు ఉచితంగా శిక్షణ పొందేందుకు కూడా దోహదపడుతోంది. జేఈఈ పరీక్షల( Jee Examinations)కు ప్రిపేర్ అవుతుంటే మీకిది శుభవార్తే. నిష్ణాతులైన సిబ్బందితో అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. ఐఐటీ జేఈఈ కోర్సులకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల కోసం అమెజాన్ ( Amazon) ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసింది. అమెజాన్ ఇండియాలో అమెజాన్ అకాడమీ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్  ద్వారా ఉచిత శిక్షణ ( Free Coaching) అందిస్తోంది. లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. https://academy.amazon.in/ వెబ్‌సైట్‌‌లో ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎన్‌రోల్ చేసుకోవల్సి ఉంటుంది. 

ప్రస్తుతం  ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అమెజాన్ అకాడమీ ( Amazon Academy) పేరుతో ఉన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని నెలల వరకూ కంటెంట్ మొత్తం ఉచితంగా తీసుకోవచ్చు. విద్యార్ధులకు ఇంటి వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అమెజాన్ అకాడమీ ఫ్లాట్‌ఫామ్‌ ( Amazon Academy platform) లో జేఈఈ  పరీక్షల కోసం సన్నద్దమయ్యే విద్యార్ధులకు అవసరమైన మొత్తం కంటెంట్ ఉంటుంది. అనుభవం కలిగిన టీచర్లు చెప్పే ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావచ్చు. మాక్ టెస్టుల్లో పాల్గొనవచ్చు. నిపుణుల సారధ్యంలో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు. రియల్ టైమ్‌లో సందేహాలు తెలుసుకోవచ్చు. అంతే కాదు ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 

Also read: Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఏరులై పారిన రక్తం, 22 మంది జవాన్లు అదృశ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News