'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతోపాటు దేశంలో 'కరోనా వైరస్' గురించి సమాచారం కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇందులో కొంత మంచి సమాచారం కాగా.. మరికొంత ఫేక్ సమాచారం కూడా ఉంటోంది. ముఖ్యంగా ఈ సమాచారం సోషల్ మీడియాలో వెబ్‌సైట్లతోపాటు సోషల్ మీడియా మెసేంజర్లలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అందులోనూ ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్‌లో కూడా కరోనా వైరస్ గురించి నెటిజనులు సమాచారం పంచుకుంటున్నారు. ఐతే కరోనా వైరస్ గురించి ఫేక్ సమాచారం కూడా తెలిసీ తెలియకుండా నెటిజనులు షేర్ చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు మరో మెసేజ్ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే.. సోషల్ మీడియా మెసేంజర్ వాట్సప్‌ను ప్రభుత్వం నిఘాలో ఉంచింది. దాని ద్వారా ఫేక్ మెసేజ్‌లు పంపించే వారిపై లేదా ఆ గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకోబోతోంది. ఒకవేళ వాట్సప్ మెసేజ్‌కు మూడు క్లిక్ మార్కులు కనిపించినట్లయితే .. ఆ మెసేజ్ పంపిన వారికి నోటీసులు పంపించే అవకాశం ఉంది. వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ వార్త సోషల్ మీడియా సైట్లలో వైరల్ అవుతోంది.
దీనిపై ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ప్రస్తుతం సోషల్ మీడియా సైట్లలో జరుగుతున్న ప్రచారం అంతా పుకార్లు మాత్రమేనని తెలిపింది. వాట్సప్‌లో మెసేజ్ పంపినప్పుడు ఒక క్లిక్ వస్తుంది.. అవతలి వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు రెండు క్లిక్స్ వస్తాయి... అవతలి వ్యక్తి మెసేజ్ చదివినప్పుడు రెండు క్లిక్కులు నీలి రంగులోకి మారతాయి. ఐతే మూడో క్లిక్ వచ్చి .. అది ఎరుపు రంగులోకి మారినప్పుడు .. ఫేక్ మెసేజ్ పంపినందుకు గానూ మెసేజ్ పంపిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ తెలిపింది. అంతే కాదు.. ఇది ఫేక్ మెసేజ్ అంటూ ట్వీట్ చేసింది.
#Fake News Alert !
Messages circulating on Social Media reading 'WhatsApp info regarding √ tick marks' is #FAKE.#PIBFactCheck : No! The Government is doing no such thing. The message is #FAKE.
Beware of rumours! pic.twitter.com/GAGEnbOLdY
— PIB Fact Check (@PIBFactCheck) April 7, 2020
మరోవైపు వాట్సప్‌లో తరచుగా కరోనా వైరస్‌కు సంబంధించి యూజర్లు పంపుతున్న మెసేజ్‌లపైన వాట్సప్ సంస్థ దృష్టి సారించింది. తరచుగా పంపుతున్న మెసేజ్‌లను కేవలం ఐదు సార్లకే కుదించినట్లు వాట్సప్ తెలిపింది. యూజర్లకు పరిమితి విధించడం వల్ల మిస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తగ్గిపోతుందని తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
'వాట్సప్ మెసేజ్'లపై కేంద్రం నిఘా పెట్టిందా..?