PM Modi: పుట్టింది ఇండియాలోనే అయినా ఫారిన్ పైన మోజు ఉండేవారు ఎంతోమంది ఉంటారు. అక్కడ ఏదో ఉంది అక్కడికి వెళ్తే ఏదో సాధించొచ్చు అని అనుకునే వారు ఇప్పటికీ ఎంతోమంది. ఇంక సంపాదన కోసం అయిపోయి ఇప్పుడు పెళ్లిళ్ల కోసం కూడా ఫారిన్ కి వెళ్ళిపోతున్నారు మన వాళ్లు. ఈమధ్య సినీ సెలెబ్రెటీస్ కూడా ఇండియాలో ప్రదేశాలే లేనట్టు డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి ఫారిన్ కి పోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ అంత అద్భుతం ఏముందో తెలియదు కానీ మొత్తానికి మనోళ్ళకి ఫారిన్ పైన పిచ్చి మాత్రం ముదిరిపోతోంది.
ఇక ఇదే విషయంపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోడీ. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇండియాలోని కొంతమంది విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, మన భారతదేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా ఆ వేడుకలేవో మన ఇండియాలోనే జరుపుకుంటే మంచిదని కోరారు. అంతేకాదు పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు కూడా మన ఇండియా వారు భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వవలసినదిగా కోరారు.
‘‘ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. ఈ సీజన్లో కనీసం ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చు. అందుకే పెళ్లిళ్లకు షాపింగ్ చేసేటప్పుడు అందరూ కూడా భారత దేశంలో తయారయ్యే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. పెళ్లిళ్ల టాపిక్ వచ్చింది కాబట్టి నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్న ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా కాలంగా ఒక విషయం నన్ను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని నేను నా కుటుంబసభ్యులతో కాకుంటే ఇంకెవరికి చెప్తాను. ఈమధ్య కొన్ని కుటుంబాలు కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే వాతారణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా..? ’’ అని మోడీ ప్రశ్నించారు.
మన భారత దేశంలో భారతీయుల మధ్య వివాహం జరుపుకుంటే, దేశంలోని డబ్బు దేశంలోని ఉంటుందని, ఇలాంటి పెళ్లిళ్లలో దేశ ప్రజలకు ఏదో ఒక సేవ చేసే అవకాశం లభిస్తుందని అలానే నిరుపేదలు కూడా మీ పెళ్లి గురించి తమ పిల్లలకు చెబుతారు అని తెలియజేశారు. పెళ్లిళ్ల విషయంలో ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సూచించారు. మీరు కోరుకునే వ్యవస్థ ఈరోజు ఉండకపోవచ్చు, కానీ మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే, వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందుతాయని, నా బాధ ఖచ్చితంగా పెద్దవారికి చేరుతుందని చెప్పుకొచ్చారు మోడీ.
అయితే ఈ మధ్యనే వరుణ్ తేజ్ లాంటివారు ఫారిన్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి వీటన్నిటిని ఉద్దేశించే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి