రాహుల్ గాంధీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు.. ఇటాలియన్‌ భాషలో చెప్పాలా అని చురకలు!

Last Updated : Aug 4, 2018, 06:31 PM IST
రాహుల్ గాంధీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు.. ఇటాలియన్‌ భాషలో చెప్పాలా అని చురకలు!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరోక్షంగా చురకలు అంటించారు. "భారతీయ జనతా పార్టీ దేశానికి ఎంత సేవ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం ఇంకా బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏం చేసిందనేది మీరే లెక్కపెట్టుకోవాలి రాహుల్ బాబా" అంటూ అమిత్ షా మరోసారి రాహుల్ గాంధీని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. " మీకు (రాహుల్ గాంధీ) ఇటాలియన్ భాషలో చెబితే కానీ అర్థం కాదేమో కానీ మీకు ఇటాలియన్ భాషలో చెప్పడానికి తనకు ఆ భాష రాదు" అంటూ రాహుల్‌పై అమిత్ షా సెటైర్లు వేశారు. శనివారం రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజస్తాన్ సంక్షేమం కోసం 100కుపైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెబుతూ.. రాజస్తాన్ కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా అమిత్ షా డిమాండ్ చేశారు. తన తల్లి సోనియా గాంధీ ఇటలికి చెందిన మహిళ కావడంతో తనని కూడా ఇటలీ సంతతికి చెందిన వాడిగానే పరిగణిస్తున్నట్టుగా మరోసారి అమిత్ షా సంధించిన వ్యంగ్యాస్త్రాలపై రాహుల్ గాంధీ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి. 

Trending News