Punjab Murder: పంజాబ్‌లో మరో దారుణం, నడిరోడ్డుపై...అందరూ చూస్తుండగా యువకుడి హత్య

Punjab Murder: పంజాబ్‌లో ఏమవుతోంది. ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య నుంచి తేరుకోకముందే..పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2022, 10:38 PM IST
Punjab Murder: పంజాబ్‌లో మరో దారుణం, నడిరోడ్డుపై...అందరూ చూస్తుండగా యువకుడి హత్య

Punjab Murder: పంజాబ్‌లో ఏమవుతోంది. ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య నుంచి తేరుకోకముందే..పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు.

పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వానికి శాంతి భద్రతలు సమస్యగా మారుతున్నాయి. ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య ఘటనను మర్చిపోకముందే...మరో ఘోరం జరిగింది. బిజీగా ఉన్న మార్కెట్‌లో..పట్టపగలు..అందరూ చూస్తుండగానే...జనం సమక్షంలోనే నడిరోడ్డుపై కత్తులతో వెంబడించి మరీ చంపేశారు. 

పంజాబ్ మోగ జిల్లా బాధిని కలాన్ ప్రాంతమిది. దేశ్‌రాజ్ అనే కూలిగా పనిచేసే 28 ఏళ్ల యువకుడు. మార్కెట్ అంతా బిజిగా ఉంది. జనసంచారం, వాహన రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి. పట్టపగలు అందరూ చూస్తుండగానే..కొందరు దుండగులు కత్తులతో ఆ యువకుడిని వెంబడించారు. ఆ యువకుడు ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఐదారుగురు దుండగులు కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా అక్కడే సమీపంలోని సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒళ్లు గగుర్పాటు కల్గిస్తున్నాయి.

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వెంటాడి చంపుతున్నా.ఎవరూ ఆ యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించకపోవడం దారుణం. కొద్దిరోజుల ముందు ఆ నిందితులకు, మరణించిన యువకుడికి మధ్య ఏదో విషయంంలో స్వల్ప వాగ్వాదం జరిగిందని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అందుకే కక్ష పెంచుకుని హత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు. చాలాదూరం నుంచి 5-6 దుండగులు రెండు బైక్స్‌పై యువకుడిని వెంటాడారని..మార్కెట్‌లో ప్రవేశించగానే వెంటబడి దాడి చేశారని పోలీసులు వివరించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: Corbevax: దేశంలో బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్‌..డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News