Corbevax: దేశంలో బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్‌..డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్..!

Corbevax: మార్కెట్‌లోకి మరో బూస్టర్ డోసు రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 4, 2022, 07:23 PM IST
  • మార్కెట్‌లోకి మరో బూస్టర్ డోసు
  • డీసీజీఐ ఆమోదం
  • 18 ఏళ్లు దాటిన వారికి కూడా డోసు
Corbevax: దేశంలో బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్‌..డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్..!

Corbevax: మార్కెట్‌లోకి మరో బూస్టర్ డోసు రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది. ఇందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(DCGI) పచ్చజెండా ఊపింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇవ్వనున్నారు. గతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ తీసుకున్న వారు కూడా కార్బెవాక్స్‌ను బూస్టర్‌ డోసుగా తీసుకోవచ్చు.

మనదేశంలో ఈతరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్‌ నిలిచింది. డీసీజీఐ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై బయోలాజికల్-ఇ మేనేజింగ్ డైరెక్టర్‌ మహిమ స్పందించారు. డీసీజీఐ ఆమోదం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశంలో బూస్టర్ డోసుల అవసరాన్ని తీర్చే అవకాశం దొరికిందని చెప్పారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్‌ బూస్టర్ డోసుగా పొంద వచ్చని తెలిపారు.

ప్రస్తుతం కార్బెవాక్స్ టీకాను 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వారికి ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 కోట్ల డోసులను బయోలాజికల్-ఇ ..కేంద్రానికి ఇచ్చింది. టీకా వృధాను తగ్గించేందుకు ఒక్క డోసును ఒకే బాటిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే వ్యాక్సిన్ ధరను సదరు సంస్థ భారీగా తగ్గించింది. గతంలో డోసు ధర రూ.840గా ఉంది. ఇప్పుడు రూ.250కి తగ్గించారు. ఈమేరకు గత నెలలోనే ప్రకటన వచ్చింది.

Also read: EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు నిరాశ, ఈపీఎఫ్ వడ్డీరేటులో భారీగా కోత, 8.10 శాతం

Also read:Odisha Cabinet: ఒడిశాలో కేబినెట్ విస్తరణకు వేళాయే..కొత్త మంత్రులు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News