Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం వెనక ఉన్న ఈ కీలక వ్యక్తి తెలుసా..

Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగా రామ నామం మారుమోగిపోతుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారమయ్యే ఈ వేళలో రామ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు ఓ పేరును. ఇంతకీ ఎవరు అతను ? అయోధ్య రామ మందిర నిర్మాణం వెనక ఆయన పాత్ర ఏమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 09:38 PM IST
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం వెనక ఉన్న ఈ కీలక వ్యక్తి తెలుసా..

Ayodhya Ram Mandir: ప్రస్తుతం దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే అయోధ్య ట్రస్టు ఆధ్వర్యంలో  బాల రాముని ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు అయోధ్య మందిర ట్రస్టు ఆహ్వానాలను అందజేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ నెల 22న సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం కట్టడం వెనక ప్రముఖ వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.  

అయోధ్యలో భవ్య శ్రీరామ మందిరం కల సాకారం అవ్వడానికి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆయనే కే.కే.నాయర్.K.K.నాయర్ గా పిలువబడే కందంగళం కరుణాకరన్ నాయర్ సెప్టెంబర్ 7న 1907లో  కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలోని గుటన్‌కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వమే ఈయన ఇంగ్లాండ్ వెళ్లి 21 సంవత్సరాల వయస్సులో బారిస్టర్ చదువులో ఉత్తీర్ణులు అయ్యారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ICS పరీక్షలో విజయం సాధించాడు. ఇప్పటి సివిల్స్ తరహా చదవు అని చెప్పాలి.

భారత దేశానికి వచ్చిన తర్వాత తన స్వరాష్ట్రం కేరళలో కొంతకాలం పనిచేసారు. అపుడు విధి నిర్వహణలో నీతి, నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. ప్రజా సేవలో  ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు.ఇక 1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్‌గా చేరారు.అక్కడ ఆయన వివిధ పదవులను నిర్వహించారు. జూన్ 1, 1949న ఫైజాబాద్ (ఇప్పటి అయోధ్య) డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.

బాల రాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని కంప్లైంట్ రావడంతో  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కె.కె.నాయర్‌ను కోరారు. KK నాయర్ తన సబార్డినేట్, శ్రీ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మనమన్నారు.

సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్‌కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు (రామ్ లల్లా) జన్మస్థలంగా ఆరాధిస్తున్నారనే తన నివేదికలో పేర్కొన్నారు. అటు అక్కడ ఇది వరకే బాబ్రీ కట్టించిన మసీదు ఉంది అని అక్కడ ముస్లింలు  సమస్యలు సృష్టిస్తున్నారని తన నివేదికలో పొందుపరిచారు. అంతేకాదు ఇది వరకే అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక  తెలియచేసింది.అంతే కాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దాని కోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అక్కడ గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పొందుపరిచారు.

ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ, కోర్టు కానీ ఎత్తివేయలేకపోవడం గమనాంచాల్సిన విషయం.

కేకే నాయర్.. యూపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేసారు.అంతేకాదు తక్షణం ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

నెహ్రు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్‌ను ఆదేశించారు.

కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరించారు. మరోవైపు, రామ లల్లాకు రోజూ పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకు అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్‌ని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. అయితే, నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకున్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించారు.  నాయర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. అదే స్థలంలో పని చేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం అప్పటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రకంగా చెంప పెట్టు అనే చెప్పాలి.  

ఈ పరిస్థితులు లో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్‌ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పారు.దీంతో ఆయన భార్యను అయినా పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు.  ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ, శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు.అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పై నాయర్ భార్య భారీ మెజారిటీతో గెలిచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

శ్రీమతి శకుంతల నాయర్ 1952లో జనసంఘ్‌లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్‌పై ఒత్తిడి తీసుకురావడం తో నాయర్  తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు, ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు.  బహ్రైచ్ మరియు కైసర్‌గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేసారు.అప్పట్లో వారిది అది ఒక చారిత్రాత్మక విజయం.నాయర్ భార్య శకుంతల నాయర్ మొత్తం గా ఒక సారి ఎమ్మెల్యే గా మూడు సార్లు ఎంపీ గా గెలిచారు. విచిత్రం ఏమిటంటే నాయర్ గారి పలుకుబడి ఎంత అంటే  అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నిక కావడం విశేషం.

ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది.

ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజా సేవను కొనసాగించారు. స్వాతంత్య్రానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది. మరి ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను ఏ ప్రభుత్వం మార్చలేకపోయారు. నాయర్ జారీ చేసిన ఆ ఆదేశాలు ఆధారంగానే పూజలు మరియు రామ్ లల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతోంది.

1976లో, మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీ 1977 లో ఆయన తన స్వగ్రామంలో కన్నుమూసారు. ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు అయోధ్యలోని ఒక బృందం కేరళకు వెళ్లింది. ఆ చితాభస్మాన్ని  అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజూ స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని  సరయు నదిలో నిమజ్జనం చేసారు.

నాయర్ కృషి వల్లనే  అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమిలో పూజలు చేయగలుగుతున్నామని ఆశేష హిందూ బంధువులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ అయోధ్య వాసులకు రాముడి తర్వాత అత్యంత ఆరాధ్యుడిగా మారారు.  

కేకే నాయర్ అయోధ్య రామ మందిరం విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ వారు అతని స్వగ్రామంలో భూమిని కొని అతనికి స్మారక చిహ్నం నిర్మించారు. K.K నాయర్ పేరుతో ప్రారంభించబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు శిక్షణను అందిస్తోంది. మొత్తంగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం వేళ ఆ మహానుభావుడిని స్మరించుకుంటున్నారు రామ భక్తులు.

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x