Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, గెస్ట్స్ లిస్ట్ వైరల్

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవిరి 22న జరగబోతుంది. ఈ కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 01:07 PM IST
Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, గెస్ట్స్ లిస్ట్ వైరల్

Ayodhya Ram Mandir Pran Pratistha Ceremony: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులు ఆహ్వానం అందింది. జనవరి 22న జరగబోయే రామ్ లల్లా యొక్క ప్రాణ-ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవం జరుగుతుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న ప్రధాన క్రతువులను నిర్వహిస్తారు. ఈ ప్రాణప్రతిష్ట వేడుకకు 7 వేల మంది అతిథులతోపాటు లక్ష మందికిపైగా భక్తులు హాజరుకానున్నారు. ‘రామ్‌లల్లా’ మహా సంప్రోక్షణ వేడుకకు సంబంధించిన 6,000 ఆహ్వాన కార్డులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు పంపిణీ చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 

ఆహ్వానం ఎవరెవరికి పంపారంటే..
రాజకీయ నాయకులు
** కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
**బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌
** కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే
** కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్
**కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి
** హెచ్‌డీ దేవెగౌడ
**కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
**బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ
**బీజేపీ మురళీ మనోహర్ జోషి
**హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్
క్రీడాకారులు
**విరాట్ కోహ్లీ
**సచిన్ టెండూల్కర్

Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు, ఇదే న్యాయం అంటున్న బిల్కిస్

సినీ ప్రముఖులు
** అమితాబ్ బచ్చన్
**మాధురీ దీక్షిత్
**రజనీకాంత్
**అక్షయ్ కుమార్
** అనుపమ్ ఖేర్
**చిరంజీవి
**సంజయ్ లీలా బన్సాలీ
**ధనుష్
** మోహన్‌లాల్
** రణబీర్ కపూర్
**అలియా భట్
**రిషబ్ శెట్టి
** కంగనా రనౌత్
**మధుర్ భండార్కర్
** టైగర్ ష్రాఫ్
**అజయ్ దేవగన్
**ప్రభాస్
**యష్
**సన్నీ డియోల్
**ఆయుష్మాన్ ఖురానా
**అరుణ్ గోవిల్
**దీపికా చిఖాలియా టోపీవాలా
**మధుర్ భండార్కర్
** మహావీర్ జైన్
** జాకీ ష్రాఫ్

పారిశ్రామికవేత్తలు
**ముఖేష్ అంబానీ
** అనిల్ అంబానీ
** రతన్ టాటా
**గౌతమ్ అదానీ

Also Read: Ayodhya Flight Fare: అయోధ్యకు విమానయానం మరింత ప్రియం, భారీగా పెరిగిన టికెట్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x