Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగా అద్వానీ, జోషి, కారణమేంటంటే

Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం కల నెరవేరనుంది. ఆ కల సాకారానికి శ్రీకారం చుట్టిన కురువృద్ధుడు మాత్రం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోనున్నారు. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2024, 10:26 AM IST
Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగా అద్వానీ, జోషి, కారణమేంటంటే

Ram mandir Pran Pratishtha: 550 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రామమందిరం ప్రారంభమౌతోందనే ప్రచారం సాగుతోంది. మరి కాస్సేపట్లో రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. శ్రీరాము జన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మాత్రం ప్రాణప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోనున్నారు. 

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట మరి కాస్సేపట్లో జరగనుంది. ఇవాళ జనవరి 22వ తేదీ 2024 మద్యాహ్నం 12.30 గంటల సమయంలో దివ్య ముహూర్తాన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు చాలామందికి ఆహ్వానాలు అందాయి. అయితే ఇవాళ సాకారం కానున్న ఈ కలకు శ్రీ రామ జన్మభూమి ఉద్యమం పేరుతో శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా రామమందిరంపై చర్చకు తెరలేపిన బీజేపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి ఎల్‌కే అద్వానీ, విశ్వ హిందూపరిషత్ నేత మురళీ మనోహర్ జోషిలు మాత్రం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోనున్నారు. వయస్సు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా ఈ ఇద్దరినీ రావద్దని శ్రీ రామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కోరింది. దాంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగడంతో విశ్వ హిందూపరిషత్ కలుగజేసుకుని ఈ ఇద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. వయస్సు , ఆరోగ్య రీత్యా ఈ ఇద్దరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. 

కానీ ఇప్పుడు తాజాగా రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎల్‌కే అద్వానీ హాజరుకావడం లేదని అద్వానీ కార్యాలయం వెల్లడించింది. తీవ్రమైన చలి కారణంగా అద్వానీ అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావడం లేదని తెలిపింది. ఇక విశ్వ హిందూ పరిషత్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ఆరోగ్యం, వయసు రీత్యా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. 

దేశమంతా ఓ పండుగలా జరుపుకుంటున్న రామమందిరం ప్రారంభోత్సవం కల సాకారమయ్యేందుకు శ్రీ రామ జన్మభూమి ఉద్యమంతో శ్రీకారం చుట్టిన అద్వానీ ప్రాణ ప్రతిష్ఠకు దూరంగా ఉండటం బాధించే అంశమే.

Also read: Instant Pancard: పాన్‌కార్డు ఇప్పుడు రెండు నిమిషాల్లోనే పొందవచ్చు, ఎలాగంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News