Instant Pancard: ఇప్పటి వరకూ పాన్‌కార్డును ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు, బ్యాంకులో ఎక్కువ మొత్తం డబ్బులు డిపాజిట్ చేసేందుకు పాన్‌కార్డు అవసరముండేది. కానీ భవిష్యత్తులో పాన్‌కార్డు ప్రాధాన్యత మరింత పెరగనుంది. అన్నింటికీ అవసరం కానుంది. ఇప్పుడు పాన్ కార్డు కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రెండే రెండు నిమిషాల్లో పాన్‌కార్డు తీసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఇదీ ఆ ప్రక్రియ..
పాన్‌కార్డు పొందాలంటే గతంలో 30-45 రోజుల సమయం పట్టేది. ఆ తరువాత 15 రోజుల్లో వచ్చేది. క్రమేపీ వారం రోజుల్లోనే పాన్‌కార్డు చేతికి వచ్చేస్తోంది. కానీ ఇప్పడు వారం రోజులు కూడా నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లోనే మీక్కావల్సిన పాన్‌కార్డు ఆన్లైన్లో పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇ పాన్‌కార్డును పొందేందుకు వీలుంది. పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని సాధారణ పాన్కార్డులానే ఆర్ధిక లావాదేవీలు అన్నింటికీ ఉపయోగించవచ్చు.
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌లో ఎడమ వైపు కన్పించే ఆప్షన్స్‌లో ఇన్స్టంట్ ఇ పాన్ క్లిక్ చేయాలి. గెట్ న్యూ పాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ టిక్ పెట్టాలి. తరువాత కంటిన్యూ క్లిక్ చేయాలి. మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆధార్ వివరాల్ని చెక్ చేసిన తరువాత అక్కడిచ్చే నిబంధనలను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా బాక్స్‌లో టిక్ చేయాలి. అంతే వెంటనే ఇ పాన్‌కార్డు వచ్చేస్తుంది. ప్రింట్ తీసుకోవచ్చు లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు.
Also read: Ram mandir pran pratishtha schedule: ప్రాణ ప్రతిష్ఠ షెడ్యూల్ ఇలా, రాముడి పాత విగ్రహం ఎక్కడుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook