Ayodhya Ram Temple: జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. దేశ విదేశాల్లోని వీవీఐపీలకు ఆహ్వానాలు అందాయి. పెద్దఎత్తున భక్తజనం అయోధ్య చేరుకోనుంది. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా విగ్రహాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేగుతోంది.
ప్రపంచంలోని హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. జనవరి 22వ తేదీన అత్యంత ఘనంగా రామాలయం ప్రారంభం కానుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. దీనికోసం ఎంపికైన రామ్ లల్లా విగ్రహం ఫోటోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప ఎక్స్ ద్వారా తెలిపారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముని విగ్రహాన్ని ఎంపిక చేయడంపై రాష్ట్రంలోని రామభక్తుల గర్వం, ఆనందం రెట్టింపు అయిందని వెల్లడించారు.
అయితే తాను చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు ఇంకా అధికారిక సమాచారం తనకు అందలేదంటున్నారు యోగిరాజ్ అరుణ్. దేవుని అవతారపు విగ్రహమైనందున పిల్లవాడి రూపంలో ఉండాలని, ప్రజలు దైవత్వం పొందాలని అరుణ్ చెప్పారు. అందుకే చిన్నారి ముఖంతో పాటు దైవత్వం ఉట్టిపడేలా ఆరేడు నెలల క్రితం విగ్రహం చెక్కిన పని ప్రారంభించినట్టు చెప్పారు. యోగిరాజ్ అరుణ్ దేశంలో అత్యంత డిమాండ్ కలిగిన శిల్పుల్లో ఒకరు. కర్ణాటకలోని కారకల ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కృష్ణ శిలతో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కారు.
ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వెనుక కన్పించే 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదార్ నాథ్లో 12 అడుగుల ఎత్తులో ఆది శంకరాచార్య విగ్రహం, మైసూరులో 21 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహం యోగిరాజ్ అరుణ్ చెక్కినవే. ముంబైకు చెందిన ప్రముఖ కళాకారుడు వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ఆధారంగా రామ్ లల్లా విగ్రహం రూపకల్పన జరిగింది. రాముడి విగ్రహం ఎంపిక కోసం డిసెంబర్ 30వ తేదీన ఓటింగ్ జరిగింది. ఇందులో యోగిరాజ్ అరుణ్ చెక్కిన విగ్రహంతో పాటు కర్ణాటకకు చెందిన మరో శిల్పి గణేశ్ భట్ చెక్కిన విగ్రహం, రాజస్థాన్ శిల్పి సత్యనారాయణ పాండే చెక్కిన విగ్రహాల్ని పరిశీలించారు.
Also read: Income tax Updates: ట్యాక్స్ ప్లానింగ్ పక్కాగా ఇలా చేస్తే, 10 లక్షల ఆదాయమున్నా నో ట్యాక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook