JVM merged in BJP : తన పార్టీని బీజేపిలో విలీనం చేసిన మాజీ సీఎం

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 2014లో తాను బీజేపికి అధ్యక్షుడిని అయినప్పటి నుంచి బాబూలాల్‌ని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

Last Updated : Feb 17, 2020, 07:02 PM IST
JVM merged in BJP : తన పార్టీని బీజేపిలో విలీనం చేసిన మాజీ సీఎం

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ వికాస్ మోర్చ పార్టీ (ప్రజాతంత్రిక్) (JVM(P)) అధ్యక్షుడు బాబూలాల్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. రాంచీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో బాబూలాల్ జేవీఎం(పి)వి బీజేపీలో విలీనం చేశారు. బాబూలాల్ బీజేపిలో ఉండగా 2000-2003 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి సేవలు అందించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2006లో ఆయన బీజేపిని వీడి సొంతంగా జార్ఖండ్ వికాస్ మోర్చ పార్టీ (ప్రజాతంత్రిక్) (జేవీఎం(పి))ని స్థాపించారు. బీజేపీ నుంచి బయటికొచ్చి జేవీఎం పార్టీని స్థాపించిన 14 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి తన పార్టీని బీజేపీలోనే విలీనం చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 2014లో తాను బీజేపీకి అధ్యక్షుడిని అయినప్పటి నుంచి బాబూలాల్‌ని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. 'బాబూలాల్ చాలా మొండోడని ఎవరో చెప్పినట్టుగానే నిజంగానే ఆయన మారడానికి చాలా సమయమే పట్టింది' అని అమిత్ షా ఛమత్కరించారు. జార్ఖండ్ ప్రజల అభీష్టం మేరకే బాబూలాల్ జేవీఎంని ( Jharkhand Vikas Morcha (Prajatantrik)బీజేపీలో విలీనం చేశారని అమిత్ షా తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News