BEL Recruitment 2021:కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్-1 విభాగంలో పలు పోస్టుల భర్తీ ప్రక్రియను బీఈఎల్ చేపట్టింది. మే 19వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో సూచించింది.
మొత్తం 23 ఇంజనీర్ పోస్టులను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భర్తీ చేయనుంది. అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లకు మించరాదు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, టెలీ కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) పూర్తి చేసిన వారు అర్హులు. ట్రైనీ ఇంజనీర్-I 20 పోస్టులున్నాయి. ప్రాజెక్ట్ ఆఫీసర్-I పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి CA/ICWA/MBA (Finance) కోర్సులు చేసిన వారిని BEL Jobsకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్లకు మించరాదు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA/MSW/PGDM కోర్సులు పూర్తి చేసిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అయితే అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లకు మించరాదు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు ముంబైలోని నేవీ యూనిట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
BEL Jobs అప్లికేషన్ ఫామ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook