Bengal Woman Shoots Boyfriend ప్రేమించిన వ్యక్తిపై యువతి కాల్పులు- తనను పట్టించుకోవడం లేదని..

Bengal Woman Shoots Boyfriend: పశ్చిమ బంగాల్ లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తి తనను పట్టించుకోవడం లేదని నెపంతో అతడిపై కాల్పులకు పాల్పడింది ఓ యువతి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె ప్రేమికుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 11:04 AM IST
Bengal Woman Shoots Boyfriend ప్రేమించిన వ్యక్తిపై యువతి కాల్పులు- తనను పట్టించుకోవడం లేదని..

Bengal Woman Shoots Boyfriend: బంగాల్‌ బర్ధమాన్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతున్న కారణంగా ఏకంగా అతడిపై కాల్పులకు తెగబడింది ఓ యువతి. నాలుగేళ్ల పాటు కలసి ఉన్న తమ బంధాన్ని పట్టించుకోకుండా.. తనను దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. 

బుధవారం రాత్రి బంగాల్ లోని కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే బుల్లెట్ బాధితుడి పొత్తికడుపును తాకుతూ వెళ్లిందని.. దీనితో పెద్దగా ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. 

ఏం జరిగిందంటే?

ఉద్యోగం కోసం కొన్ని నెలల క్రితం ఝార్ఖండ్ వెళ్లిన నిందితురాలు.. ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తన ప్రియుడిని కలవాలని ఉందని.. స్థానిక సర్కస్ మైదానానికి రమ్మని కోరింది. అతను వెళ్లిన అనంతరం ఈ దారుణానికి పాల్పడింది.

"నేను మైదానానికి వెళ్లగానే ఆమె నన్ను కౌగిలించుకుంది. ముద్దు పెట్టుకుంది. కలసి సిగరెట్లు కాల్చాం. ఏమైందో ఏమో.. తుపాకీ తీసి అమాంతం నాపై కాల్పులు జరిపింది" అని ఆ బాధితుడు వాపోయాడు. 

కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్లే మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.  

Also Read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- మరణాల్లో స్వల్ప వృద్ధి

ALso Read: Sheena Bora: షీనా బోరా కశ్మీర్‌‌లో బతికే ఉందంటోన్న ఇంద్రాణి ముఖర్జి.. సీబీఐకి లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News