Bengaluru Airport: ఆ విమానాశ్రయంలో అడుగుపెడితే జేబు గుల్ల, 7 నిమిషాలకు 150 రూపాయలు

Bengaluru Airport: ఇప్పటికే ప్రయాణీకుల్ని దోచుకోవడంలో విమానయాన సంస్థలు పోటీ పడుతుంటాయి. ఇక విమానాశ్రయాలు కూడా అదే పంధా ఆచరిస్తున్నాయి. తెలిసో తెలియకో మీరు గనుక ఆ విమానాశ్రయంలో అడుగుపెట్టే సాహసం చేయకండి..చేశారంటే అంతే సంగతులు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2024, 10:33 AM IST
Bengaluru Airport: ఆ విమానాశ్రయంలో అడుగుపెడితే జేబు గుల్ల, 7 నిమిషాలకు 150 రూపాయలు

Bengaluru Airport: ప్రతి విమానాశ్రయంలో వాహనాలకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. సాధారణంగా 40-50 రూపాయలు మించకుండా ఉంటుంది. గరిష్టంగా ఉంటే 100 రూపాయలుండవచ్చు. టైమ్ లిమిట్ ఎక్కువే ఉంటుంది. కానీ ఎక్కడా నిమిషానికింతని చొప్పున లూటి చేసే పరిస్థితి ఉండదు. బెంగళూరు విమానాశ్రయం ఇప్పుడీ లూటీ ప్రారంభించింది. నిమిషానికింతని వసూలు చేస్తోంది. 

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద, రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. బెంగళూరు కీలక నగరం కావడంతో విమానాల రాకపోకలు ఎక్కువే ఉంటాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులతో కిటకిటలాడుతుంటుంది. ఈ బిజీని దృష్టిలో ఇప్పుడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లూటీకు శ్రీకారం చుట్టేసింది. ఇక నుంచి ఈ విమానాశ్రయంలో అడుగుపెడితే చాలు జేబు గుల్లయిపోతుంది. కొత్తగా వాహనాలకు ఎంట్రీ ఫీజు నిమిషాలు ప్రాతిపదికన వసూలు ప్రారంభించింది. ప్రైవేట్, కమర్షియల్ వాహనాలు అన్నీ విమానాశ్రయంలో వెళ్లాలంటే ప్రవేశరుసుము భారీగా కట్టాల్సిందే. 

ప్రతి 7 నిమిషాలకు 150 రూపాయలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే 7 నిమిషాలకంటే తక్కువైనా 150 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఏడు నిమిషాలు దాటిన తరువాత 14 నిమిషాల వరకూ 300 రూపాయలు వసూలు చేస్తారు. అంటే నిమిషానికి 20 రూపాయలు క్షవరం అవుతుంది. 14 నిమిషాలు దాటాక ఎయిర్‌పోర్ట్ వదిలిపోవల్సిందే. లేకపోతే ఆ వాహనాన్ని సిబ్బంది లాక్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. ఇక ఆ వాహనం విడిపించుకోడానికయ్యే ఖర్చంతా ఆ యజమానే భరించాల్సి ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజును టెంపో ట్రావెలర్స్‌కు కూడా వర్తింపజేశారు. బస్సులకు ఎంట్రీ ఫీజు 600 రూపాయలుగా ఉంది. టెంపో ట్రావెలర్లు 300 రూపాయలు చెల్లించాలి. బస్సులు, టెంపో ట్రావెలర్లు లేన్ 3 మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. 

ఎంట్రీ ఫీజు టికెట్ పోతే 600 చెల్లించాలి. వాహనాల్ని రెండు రకాలుగా విభజించింది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. వైట్ బోర్డ్ వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ఎల్లో, ఎలక్ట్రికల్ కమర్షియల్, సెల్ఫ్ డ్రైవ్ వాహనాల్ని కమర్షియల్ వాహనాలుగా పరిగణిస్తారు. 

Also read: AP TS Weather Updates: నైరుతి, అల్పపీడనం ప్రభావం, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News