Bengaluru Traffic: బెంగళూరు ఐటీ సంస్ఠలకు ట్రాఫిక్ గండం.. ఒక్క రోజే 225 కోట్ల నష్టం

Bengaluru Traffic:  బెంగళూరు ఐటి కంపెనీలకు ట్రాఫిక్ సమస్య పెద్ద గండంగా మారుతోంది. ట్రాఫిక్ కష్టాలతో ఆగస్టు 30న ఒక్క రోజే బెంగళూరు ఐటీ సంస్థలు 225 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఆగస్టు 30న బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమలమయ్యాయి.

Written by - Srisailam | Last Updated : Sep 5, 2022, 11:03 AM IST
  • బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు
  • ట్రాఫిక్ లో ఐటీ ఉద్యోగులు
  • ఒక్క రోజే 225 కోట్ల నష్టం
Bengaluru Traffic: బెంగళూరు ఐటీ సంస్ఠలకు ట్రాఫిక్ గండం.. ఒక్క రోజే 225 కోట్ల నష్టం

Bengaluru Traffic:  బెంగళూరు ఐటి కంపెనీలకు ట్రాఫిక్ సమస్య పెద్ద గండంగా మారుతోంది. ట్రాఫిక్ కష్టాలతో ఆగస్టు 30న ఒక్క రోజే బెంగళూరు ఐటీ సంస్థలు 225 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఆగస్టు 30న బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమలమయ్యాయి. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. నగరంలో భారీగా ట్రాఫిక్ జామైంది. వాహనదారులు దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఆఫీసులకు వెళ్లలేకపోయారు. దీంతో తమకు నష్టం జరిగిందని ఐటీ కంపెనీలు ప్రకటించాయి. బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మెజార్టీ ఐటీ సంస్థలు ఉన్నాయి. ఇక్కడే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది.

ట్రాఫిక్ సమస్యలు, తమకు జరిగిన నష్టంపై ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ సెప్టెంబర్ 1న  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది. ట్రాఫిక్ సమస్యలను వివరిస్తూనే అందుకు గల కారణాలను చెప్పింది. నగరం యొక్క మౌలిక సదుపాయాలను పునరాభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరాన్ని గురించి వివరించింది అసోసియేషన్.  ORR యొక్క పేలవమైన మౌలిక సదుపాయాలు ఇప్పుడు సంక్షోభ స్థాయికి చేరుకున్నాయని లేఖలో తెలిపారు.

అవుటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌లో కృష్ణరాజపురం నుండి  బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ప్రాంతం వరకు లక్షన్నర మందికి పైగా ఉపాధి పొందుతున్నారని అంచనా. 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోటి మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అయినా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ తన లేఖలో తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో బెంగళూరు అత్యంత హీన స్ఠితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఐటీ సంస్థల పురోగతిని దెబ్బతీయడమే కాకుండా నగరాభివృద్దిపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. పరిస్థితి ఇలాగే ఉంటే కంపెనీలు ప్రత్యామ్నాయ గమ్యాన్ని వెతకవచ్చని అసోసియేషన్ ఆందోళన వ్యక్తంం చేసింది.

బెంగళూరు ఆదాయంలో ఐటీ సంస్థల వాటానే ఎక్కువ. ప్రతి ఏటాఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ USD 22 బిలియన్ల ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇది బెంగళూరు మొత్తం ఆదాయంలో 32 శాతం. రాబటి భారీగా వస్తున్నా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మాత్రం దారుణంగా ఉన్నాయని ఐటీ అసొసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ORR జనాభాలో కేవలం 30 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, ఇతరుల పనుల కోసం బయటికి వస్తున్నా సమస్య ఇంత తీవ్రంగా ఉందని అంటున్నారు. మౌలిక సదుపాయల లేమి, ట్రాఫిక్ కష్టాలతో ఇప్పటికే పలు సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని తెలుస్తోంది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు తగ్గించుకోవడమే లేక వర్క ఫ్రమ్ హోమ్ చేయించడమో చేస్తున్నాయి. ఇవన్ని కర్ణాటక రాష్ట్ర ఆదాయానికి కోత పెడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇక  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పౌర సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో మురుగునీటి కాలువలకు అడ్డుగా ఉన్న ఆస్తులు, ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి హామీలు ఎంతవరకు అమలవుతాయన్నది ప్రశ్నార్దకమే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News