Rahul gandhi: ఎన్నికల ప్రచారంలో అపశృతి... రాహుల్ గాంధీకి తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్..

Loksabha elections 2024: బీహర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 27, 2024, 08:04 PM IST
  • రాహుల్ కు తప్పిన ప్రమాదం..
  • బీహర్ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన..
Rahul gandhi: ఎన్నికల ప్రచారంలో అపశృతి... రాహుల్ గాంధీకి తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్..

Stage collapses partially in Paliganj bihar: దేశంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఎన్నికల ప్రచారం జోరును పెంచింది. అదే విధంగా కాంగ్రెస్ కూడా తన దైనస్టైల్ లోఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి  బీహర్ కు వెళ్లారు.  ఈ క్రమంలో ఆయనకు అనుకొని ఘటన ఎదురైంది. రాహుల్ గాంధీ బీహర్ లోని పాలిగంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ..  తమ ఎంపీ అభ్యర్థి.. లాలు ప్రసాద్   కుమార్తె  మిసాభారతీని గెలిపించాలని కోరుతు అభివాదం చేశారు. ఆ సమయంలో అనేక మంది స్థానిక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో కలిసి స్టేజ్ మీదకు వచ్చారు. అందరు కలిసి తమకు మద్దతుగా ఉండాలని కోరుతూ, ప్రజలకు రాహుల్ అభివాదం చేశారు.

 

అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. స్టేజీ ఒక్కసారిగా కిందకు వంగికుప్పకూలీపోయింది. వెంటనే అప్రమత్తమైన రాహుల్ గాంధీ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఆయన సెక్యురిటీ రాహుల్ ను పడిపోకుండా కాపాడారు. అప్రమత్తమైన శ్రీమతి మిసా భారతి వెంటనే రాహుల్ ను గాంధీని చేతితో పట్టుకున్నారు. ఆయన కిందకు పడిపోకుండా, గట్టిగా పట్టుకున్నారు. దీంతో రాహుల్ పట్టుకోల్పోకుండా తిరిగి ప్రజలకు అభివాదం తెలిపారు.ఈ నేపథ్యంలో తమ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షేమంగా ఉన్నారని, ఆయనకు ఏంకాలేదని కూడా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.  ఈ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా లోక్ సభ లో ఏడో దశ ఎన్నికలు జూన్ 1 న జరుగనున్నాయి. 7వ దశ లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన అభ్యర్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి చెందిన కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల 7వ దశలో ఎనిమిది రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది.

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

ఏడో విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో 13 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 9 సీట్లు, బీహార్‌లో 8 సీట్లు, ఒడిశాలో 6 సీట్లు, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 సీట్లు, జార్ఖండ్‌లో 3 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక..లోక్‌సభ ఎన్నికలలో 7వ దశ జూన్ 1న జరుగుతుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4 వెలువడనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News