Birth Certificate Rule: భారతదేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కు కూడా అదే రకమైన గుర్తింపుగా కీలకం కానుంది. ఇప్పుడు దేశంలోని అన్ని రకాల అవసరాలకు బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఓ మనిషి పుట్టినప్పటి నుంచి చదివేందుకు స్కూల్, కాలేజీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో సహా ఇతర ప్రభుత్వ రంగ సేవల కోసం ఈ డాక్యుమెంట్ ను అందజేస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం ప్రకారం.. వచ్చే నెల అనగా, అక్టోబరు 1 నుంచి ఈ చట్టం అమలు కానుంది. జనన మరణాలు నమోదు చట్టం - 2023 బిల్లును గత వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది.
జనన, మరణాల నమోదు చట్టం - 2023 లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చే రైట్స్ ను ఉపయోగించి.. కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయనుంది. అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
Also Read: Man Caught Spitting On Food: ఫుడ్ పార్సెల్‌పై ఉమ్మేసిన డెలివరి బాయ్.. వీడియో వైరల్
ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి జన్మించే వారికి తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయనున్నారు. వ్యక్తి పుట్టినతేదీ, పుట్టిన ప్రదేశాన్ని సూచించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుతంతో పాటు రాష్టంలో ఇతర సేవలను వినియోగించుకునేందుకు ఈ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఉద్యోగ నియామకాల కోసం బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ లా వినియోగించుకోవచ్చు.
జనన మరణాల నమోదు చట్టం - 2023 ప్రకారం.. దేశవాప్తంగా ఉన్న పౌరుల డేటాను నియంత్రించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం కలదు. ఇందులోని చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లు.. జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్ లో షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రతి రాష్ట్రంలో తమ తమ పౌరుల డేటాబేస్ ను నిర్వహించాల్సిన అవసరం ఉంది.
Also Read: CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook