త్రిపురలో రెచ్చిపోయి "డ్యాన్స్" చేస్తున్న బీజేపీ..!

త్రిపుర రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ గెలవబోతుందని వార్తలు వస్తు్న్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది.

Last Updated : Mar 3, 2018, 04:43 PM IST
త్రిపురలో రెచ్చిపోయి "డ్యాన్స్" చేస్తున్న బీజేపీ..!

త్రిపుర రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ గెలవబోతుందని వార్తలు వస్తు్న్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది. వీధుల్లోకి వచ్చి తీన్మార్ స్టైల్‌లో రెచ్చిపోయి డ్యాన్సులు చేయడం ప్రారంభించారు బీజేపీ అభిమానులు. ఇప్పటికే త్రిపుర పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు బిప్లాప్ కుమార్ దేవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో మునిగితేలారు. ఇప్పటి వరకు కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచిన త్రిపురలో బీజేపీ హవా కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అసలు ఇక్కడ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. త్రిపుర, నాగాలాండ్‌లలో మిత్రపక్షాల సహాయంతో బరిలోకి దిగిన బీజేపీ తన హవాను తుది వరకూ కొనసాగించింది

Trending News