Karnataka: టికెట్ ఎవరికైనా ఇస్తాం..హిందూవులలో ఏ వర్గమైనా ఫరవాలేదు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్ ఇవ్వం. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు..
కర్నాటకలో ఇటీవలి కాలంలో పరిణామాలు మారుతున్నాయి. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు బెళగావి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి వాతావరణం హాట్ గా మారింది. దీనికి కారణం కర్నాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు.
బెళగావి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కోవిడ్ వైరస్ కారణంగా మరణించారు. దాంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్ని పురస్కరించుకుని కర్నాటక మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. బెళగవి లోక్ సభ టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం అభ్యర్ధికి ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పడం దీనికి కారణం.
బెళగావి హిందూత్వకు కేంద్రమని..ఈ స్థానంలో ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రశ్నే లేదని కూడా ఈశ్వరప్ప చెప్పారు. బీజేపీలో కురుబ, లింగాయత్, వక్కలింగ, బ్రాహ్మణ కులాల పట్టింపు లేదని..ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మరే ఇతర పార్టీలోనూ ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పారు. గెలిచే సామర్ధ్యమున్న వ్యక్తికి..పార్టీ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నేతలు కలిసి ఎంపిక చేస్తారని అన్నారు.
మంత్రి ఈశ్వరప్ప చెప్పిందేంటి..
మేం టిెకెట్ కురుబ, లింగాయత్, వక్కలింగ లేదా బ్రాహ్మణులకైనా ఇస్తాం. కానీ ముస్లింలకు ఇవ్వం. బెళగావి ఒక హిందూత్వ కేంద్రం. ఇక్కడ ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు. హిందూత్వ వాదులకు మేం టికెట్ ఇస్తాం. సంగోలి రాయన్న అనుచరులకు , కిత్తూర్ చెన్నమ్మ అంటే స్వాతంత్ర సమరయోధులు లేదా శంకరాచార్యకు ఇస్తామో లేదో మాకు తెలియదు.
We might give the party ticket to any community of Hindus. Whoever we might give it to -- maybe Lingayats, Kurubas, Vokkaligas, or Brahmins but definitely, it will not be given to Muslims: KS Eshwarappa, Karnataka Minister & BJP leader (29.11.2020) pic.twitter.com/0cA1Lchqz4
— ANI (@ANI) November 30, 2020
కర్నాటక మంత్రి ఈశ్వరప్ప నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముస్లింలకు టికెట్ ఇవ్వదని..గత యేడాది కొప్పల్ లో చెప్పారు. అయితే వెంటనే దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. తాను ముస్లింలతో సహా ఏ వర్గానికి వ్యతిరేకి కాదని..తనను అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పానని అన్నారు.
Also read: Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..ఇవాళ్టి నుంచేనా