Bombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కుందా లేదా, ఉంటే ఎంత వరకు ఉంది ఈ ప్రశ్నలకు ఇప్పుడు బోంబే హైకోర్టు సమాధానమిచ్చేసింది. తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు విషయంలో బోంబే హైకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 14, 2024, 03:55 PM IST
Bombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు లేదా..ఎందుకు లేదు, ఎలాంటి పరిస్థితుల్లో లేదనే అంశంపై బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పట్నించి కాదు..ఏకంగా 2007 నుంచి అంటే 17 ఏళ్ల నుంచి పెండింగులో ఉన్న కేసులో ఆఖరికి తీర్పు ఇచ్చేసింది. కోర్టు తీర్పులో సంచలన విషయాలు వెల్లడించింది. 

2007 నుంచి బోంబే హైకోర్టులో ఓ కేసు పెండింగులో ఉంది. ఇది తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కుకు సంబంధించిన అంశం. ఈ కేసు 1952లో చనిపోయిన ముంబైకు చెందిన యశ్వంత్ రావుకు చెందింది. ఇతనికి ఇద్దరు భార్యలు, ముగ్గరు కుమార్తెలు. 1930లో మొదటి భార్య లక్ష్మీబాయి మరణంతో భికూబాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె చంపూబాయి. కొన్నేళ్లకు మొదటి భార్య కుమార్తె రాధాబాయి ఆస్థి పంపకాలపై కోర్టులో కేసు వేసింది. తండ్రి ఆస్థిలో సగభాగం ఇవ్వాలనేది ఆ కేసు. ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. 1937 హిందూ విమెన్స్ ప్రోపర్టీ రైట్స్ యాక్ట్ ప్రకారం ఆస్థి భికూబాయికి 1956 హిందూ సక్సెషన్ చట్టం ప్రకారం వర్తించిందని కోర్టు తెలిపింది. 1956 కంటే ముందున్న చట్టాల ప్రకారం సక్సెషన్ హక్కుల్ని పరిగణించాలని బోంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఏ విధమైన ఇతర బంధువుల్లేని విడో కుమార్తెకు 1956 కంటే ముందు సక్సెషన్ హక్కులున్నాయో లేదా అనేది తెలుసుకోవాలని కోరింది. 

హిందూ విమెన్స్ ప్రోపర్టీ రైట్స్ చట్టం 1937 ప్రకారం కుమార్తెలకు ఎలాంటి ఆస్థి హక్కు ఉండదు. ఆ ఆస్థి కేవలం కుమారులకే వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు ఇచ్చేదైతే అందులో స్పష్టంగా ఉండి ఉండేదని కోర్టు వెల్లడించింది. 1956 హిందూ సక్సెషన్ చట్టం అమలుకు ముందే తండ్రి మరణించి ఉంటే అతని కుమార్తెకు ఆస్థిపై ఎలాంటి హక్కు ఉండదని బోంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ జితేంద్ర జైన్ ఈ కేసు తీర్పు ఇచ్చారు. 1956 చట్టం కంటే ముందే తండ్రి చనిపోవడంతో అప్పటికి ఉన్న చట్టాల ప్రకారం కుమార్తెలు ఆస్థికి వారసులు కారు. అందుకే బోంబే హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 

Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకటనపై గుడ్‌న్యూస్, కనీస వేతనం ఎంత పెరగనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News