Booster Dose: దేశంలో కరోనా ఉధృతి..కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Booster Dose: భారత్‌లో వైరస్‌ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 6, 2022, 06:51 PM IST
  • కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష
  • బూస్టర్ డోసు వ్యవధిని తగ్గిస్తూ నిర్ణయం
  • నిపుణుల సూచనలతో గ్రీన్‌సిగ్నల్
Booster Dose: దేశంలో కరోనా ఉధృతి..కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Booster Dose: దేశంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. నిపుణుల సూచనలకు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు అందిస్తున్నారు. 

ఐతే ప్రస్తుతం దేశంలో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. ఫోర్త్ వేవ్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్(NTAGI) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 

Also read:ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ షో..నిరాశ పర్చిన విరాట్ కోహ్లీ..! 

Also read:Mukhtar Abbas Naqvi: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీ..?నుపుర్ శర్మ వ్యవహారం నుంచి బయటపడేందుకేనా..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News