BRO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1178 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

BRO Recruitment 2022: కేవలం 10, 12 ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 01:02 PM IST
  • బోర్డర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022
  • మల్టీ స్కిల్డ్ వర్కర్, స్టోర్ కీపర్ పోస్టులు
  • విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి
BRO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1178 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

BRO Recruitment 2022: కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుంచి 1178 పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేషన్, నర్సింగ్, అసిస్టెంట్), స్టోర్ కీపర్ (టెక్నికల్), మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఖాళీల వివరాలు :

మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేషన్) : 147
మల్టీ స్కిల్డ్ వర్కర్ (నర్సింగ్ అసిస్టెంట్) : 155
స్టోర్ కీపర్ టెక్నికల్ : 377
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) : 499

వయో పరిమితి : అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల లోపు ఉండాలి. బీసీ మూడేళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి వయోపరిమితిలో ఎలాంటి సడలింపు ఉండదు.

వేతనం : రూ.18,000 నుంచి రూ.63,200 వరకు

విద్యార్హత : ఆయా పోస్టులను బట్టి 10, 12 తరగతుల్లో ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు నర్సింగ్, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఐటీఐ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ, ఫీజు:

ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్య తేదీలు : మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేషన్, నర్సింగ్, అసిస్టెంట్) పోస్టులకు జులై 22, స్టోర్ కీపర్ టెక్నికల్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 11 తుది గడువు. 

పూర్తి వివరాలకు www.bro.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

Also Read: Corona New Wave: ఫ్రాన్స్‌లో కోరలు చాస్తున్న కరోనా..కొత్త వేవ్‌ ప్రభావమేనా..శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!

Also Read: KTR Anand Mahindra Fun: నా బాధంతా మిమ్మల్ని టాలీవుడ్ ఎక్కడ లాగేసుకుంటోందననే.. కేటీఆర్‌పై ఆనంద్ మహీంద్రా ఫన్ పంచ్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News