KTR Anand Mahindra Funny Conversation: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మధ్య ట్విట్టర్ వేదికగా సరదా సంభాషణ చోటు చేసుకుంది. జహీరాబాద్‌లో బుధవారం (జూన్ 23) మంత్రి కేటీఆర్ మహీంద్రా ట్రాక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహీంద్రా యూనిట్‌లో తయారైన 3,00,001వ ట్రాక్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ట్రాక్టర్ నడుపుతూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్.. ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఆనంద్ మహీంద్రా గారు.. నేను మీ ఉత్పత్తులకు ఇలా ఫోటోల ద్వారా ప్రచారం కల్పిస్తూ, మార్కెటింగ్ చేస్తున్నందుకు మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 'కేటీఆర్.. మీరొక తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో సందేహం అక్కర్లేదు. అయితే నా బాధంతా ఏంటంటే.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న టాలీవుడ్ సామ్రాజ్యం ఎక్కడ మిమ్మల్ని లాగేసుకుంటుందోనని..!' అంటూ బదులిచ్చారు.
ఆనంద్ మహీంద్రా ఫన్నీ రిప్లైకి కేటీఆర్ కూడా అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చారు. 'సార్.. మీరు ఆటపట్టించేందుకు ఇంకెవరూ దొరకలేదా..' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సరదా సంభాషణ నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.
కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత:
జహీరాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ ప్రైవేట్ రక్షణరంగ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు ఆందోళనకు దిగగా పోలీసులు లాఠీఛార్జి జరపడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
Was delighted to launch the 3,00,001st @MahindraRise tractor made in #Telangana at Zaheerabad today
Hey @anandmahindra Ji, you may have to bring more business to my state for the way I’ve been posing & marketing your products 😄 pic.twitter.com/XAHg4CknqO
— KTR (@KTRTRS) June 22, 2022
Sir 🙏 Koi Aur Nahi Mila Aapko Kheenchne Ko 😁 https://t.co/JcCdzU02mZ
— KTR (@KTRTRS) June 22, 2022
Also Read: Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!
Also Read: Amma Vodi Scheme in AP: ఈసారి అమ్మ ఒడి పథకంలో కోత తప్పదా..ప్రభుత్వ వాదన ఏంటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook