యూపీలో బీఎస్పీ, ఎస్పీ మధ్య కుదిరిన పొత్తు, బీజేపీ వ్యతిరేక పోరులో ఒంటరైన కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న మహాకూటమికి ఝలక్ ఇస్తూ మాయా, అఖిలేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

Last Updated : Jan 12, 2019, 05:01 PM IST
యూపీలో బీఎస్పీ, ఎస్పీ మధ్య కుదిరిన పొత్తు, బీజేపీ వ్యతిరేక పోరులో ఒంటరైన కాంగ్రెస్

ఉత్తర్ ప్రదేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన బీఎస్పీ-ఎస్పీ మధ్య లోక్ సభ ఎన్నికల పొత్తు కుదిరింది. యూపీలోని మొత్తం  80 లోక్ సభ సీట్లు ఉండగా  ఇరు పార్టీలు 38 -38 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. మిగిలిన 4 నాలుగు సీట్లు రిజర్వ్ లో ఉంచారు. ఈ నాల్గింటిలో అమేథి-రాయ్‌బరేలీ కాంగ్రెస్ కు వదిలిపెట్టగా.. ఇతర పార్టీల కోసం రెండు సీట్లు కేటాయించారు. మామావతి- అఖిలేష్ యాదవ్ సంముక్త మీడియా సమావేశం నిర్వహించి ఈ మేరకు ప్రకటన చేశారు.

కాంగ్రెస్ తో లాభం లేదు - మాయ

ఈ సందర్భంగా బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని పేరొన్నారు. అయితే తమతో కాంగ్రెస్ ను కలుపుకుపోతే వచ్చే లాభం ఏమీ లేదనే విషయంలో గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్  పొత్తు పెట్టుకుంటో ఓట్ల బదిలీ జరగదని..ఈ పరిణామం బీజేపీకే లాభిస్తుందన్నారు. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పార్టీలు కలిసి పోరాడాలని  నిర్ణయించామని..అందుకే ఇరుపార్టీలు పొత్త పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.  దేశంలోని అత్యధిక సీట్లు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయని..ఇక్కడ బీజేపీని నిలువరించగల్లితే మోడీని అధికారంలోకి రాకుండా చేయవచ్చని మాయవతి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ను సంప్రదించలేదు - అఖిలేష్య

ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఇది కేవలం ఎన్నికల కోసం పొత్తు కాదని..బీజేపీ పాలనలో జరగుతున్న అచరాకాలకు చెక్ పెట్టేందుకు తాము పొత్తుపెట్టుకోవాలని నిర్ణయించామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ కు సంప్రదించలేదని పేర్కొన్నారు

Trending News