Cable Operators: భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ప్రసారాలపై దుమారం.. జియో టీవీపై కేబుల్‌ ఆపరేటర్ల ఆందోళన

Cable Operators Objection JIO TV Providing: ఇప్పటికే కుదేలవుతున్న కేబుల్‌ టీవీ రంగం జియో ఓటీటీ ప్రసారాలతో మరింత నష్టపోతున్నది. దీంతో కేబుల్‌ ఆపరేటర్లు జియో టీవీపై ట్రాయ్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 3, 2024, 06:35 PM IST
Cable Operators: భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ప్రసారాలపై దుమారం.. జియో టీవీపై కేబుల్‌ ఆపరేటర్ల ఆందోళన

Cable Operators Protest: ఓటీటీలో భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంపై దుమారం మొదలైంది. ఓటీటీ వేదికైన జియోలో మ్యాచ్‌ ప్రత్యక్షప్రసారంపై కేబుల్‌ టీవీ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన బాట పట్టారు. జియోలో మ్యాచ్‌ ప్రసారం కావడంతో తాము ఆర్థికంగా చాలా నష్టపోతున్నట్లు కేబుల్‌ ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు. వెంటనే జియోలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రసారం చేయడం ట్రాయ్‌ నిబంధనలకు విరుద్ధమని ప్రకటించారు. ఈ మేరకు కేబుల్‌ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.

Also Read: Manu bhaker Coach: మను బాకర్ కోచ్ కు బిగ్ షాక్... పారిస్ నుంచి హుటా హుటీన భారత్ కు.. అసలేం జరిగిందంటే..?

 

టీ20, వన్డే సిరీస్‌లు భారత్‌, శ్రీలంక జట్లు ఆడుతున్నాయి. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించి మ్యాచ్‌ల ప్రసారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో జరగడంపై దేశవ్యాప్తంగా కేబుల్‌ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఢిల్లీ ప్రతినిధులు ట్రాయ్‌ చైర్మన్‌కు లేఖ రాశారు. జియోలో ఎలా కంటెంట్‌ ప్రసారం చేస్తారని ప్రశ్నించారు. ట్రాయ్‌ నిబంధనల్లో ఉన్న క్రికెట్‌ ప్రసారాలను జియో ఓటీటీ ఎలా ప్రసారం చేస్తుందని నిలదీశారు. ఓటీటీ ప్లాట్‌ఫారం ద్వారా తమ కేబుల్‌ టీవీ రంగం ప్రశ్నార్థకంగా మారిందని కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సంఘం చైర్మన్‌ విజయ్‌పాల్‌ సింగ్‌ చౌహన్‌, అధ్యక్షుడు నరేందర్‌ బగ్రి తెలిపారు.

Also Read: Paris Olympics 2024: పి.వి. సింధు పోరాటం ముగిసింది..బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‎లో ఓటమి.!!

 

'బ్రాడ్‌కాస్ట్‌ ప్రేక్షకుల పరిశోధన మండలి (బీఏఆర్‌సీ) నివేదిక ప్రకారం దేశంలో కేబుల్‌ టీవీ వీక్షకుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపింది. రోజురోజుకు కేబుల్‌ టీవీ వీక్షకుల సంఖ్య తగ్గడానికి కారణం ఓటీటీ సంస్థలు. క్రికెట్‌కు సంబంధించిన ముఖ్యమైన కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎలా ప్రసారాలు చేస్తాయని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నిలదీసింది. ఓటీటీని ఇంకా రెగ్యులరైజ్‌ చేయలేదని ఇప్పుడూ.. గతంలో కూడా ట్రాయ్‌, ఎంఐబీ సూటిగా చెప్పింది. ఇప్పుడు భారత్‌, శ్రీలంక మ్యాచ్‌లు ప్రసారం చేయడం తగదని కేబుల్‌ ఆపరేటర్లు స్పష్టం చేశారు. లీనర్‌ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న బ్రాడ్‌కాస్ట్‌ అందరికీ వెంటనే ప్రసారాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బ్రాండ్‌కాస్ట్‌లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేబుల్‌ టీవీ రంగంలో టెన్‌ స్పోర్ట్స్‌ లైవ్‌ రూ.19+ జీఎస్‌టీతో కలిపి భారత్‌, శ్రీలంక మ్యాచ్‌లు అందిస్తుండగా.. జియె టీవీ ఓటీటీ ఉచితంగా మ్యాచ్‌ ప్రసారాలు అందిస్తోంది. ఇలా చేయడంతో మొత్తం భారత కేబుల్‌ టీవీ రంగాన్నే సంక్షోభంలోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఓటీటీ వేదికల్లో ట్రాయ్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం డిమాండ్‌ చేసింది. గతంలో ఇదే విషయమై టాటా ఐపీఎల్‌ సమయంలో కూడా కేబుల్‌ ఆపరేటర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఓటీటీ సంస్థలు పెరిగిపోతుండడంతో కేబుల్‌ టీవీ రంగం దివాళా తీసే పరిస్థితికి వెళ్తుండడం ఆందోళన కలిగించే విషయం
.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News