న్యూఢిల్లీ: లంచం తీసుకున్నందుకు సీబీఐ తన కార్యాలయంలో ఒక అధికారిని అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. శనివారం ఢిల్లీ ఎన్నికలున్న తరుణంలో అర్ధరాత్రి అధికారి అరెస్టు మనీష్ సిసోడియా స్పందిస్తూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన అధికారి గోపాల్ కృష్ణ మాధవ్, మనీష్ సిసోడియా కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేశారు.
పన్ను ఎగవేత కేసును పరిష్కరించడానికి లంచం తీసుకుంటున్నప్పుడు సీబీఐ ఉచ్చులో పడ్డాడని ఏఎన్ఐ తెలిపింది. ఆప్ నేత మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. జీఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)లో ఐదేళ్ళుగా నాతో ఓఎస్డిగా ఉన్న ఒక అధికారి రూ .2 లక్షల లంచం తీసుకున్నందుకు అరెస్టు చేయబడ్డారని నాకు తెలిసిందని అన్నారు. సీబీఐ చేసింది సరైనదేనని, కఠినమైన చర్య తీసుకోవాలని మనీష్ సిసోడియా అన్నారు. అరెస్టుపై నాకు ఎలాంటి సమస్యలు లేదని, ఎవరు లంచం తీసుకున్నా వెంటనే పట్టుబడాలని, అవినీతిపై మాకు సహనం లేదని ఆయన అన్నారు. అధికారిని కఠినంగా శిక్షించాలని ఆయన ట్వీట్లలో పేర్కొన్నారు. 2015లో గోపాల్ కృష్ణమాధవ్ను ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమించినట్లు ఢిల్లీ ప్రభుత్వ వెబ్సైట్ వెల్లడించింది. ఆప్ మంత్రి మనీష్ సిసోడియా ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లేవని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..