యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు చేసింది. దాదాపు 20 బ్యాంకులకు సంబంధించి 4037.87 కోట్లు మోసం చేసిన కేసు ఇది. ఈ కంపెనీ పేరు కార్పొరేట్ పవర్ లిమిటెడ్. ఐరన్, స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీగా రిజిస్టర్ అయి ఉంది.
కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ నాగ్‌పూర్, ముంబై, రాంచీ, కోల్‌కతా, దుర్గాపూర్, ఘజియాబాద్, విశాఖపట్నం సహా 16 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో నేరారోపిత డాక్యుమెంట్లు, ఆర్టికల్స్ స్వాధీనం చేసుకుంది సీబీఐ. 2013 సెప్టెంబర్ 30న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏగా ప్రకటించింది. అటు ఇతర బ్యాంకులు సైతం ఎన్పీఏగా నిర్ధారించాయి. 2019 అక్టోబర్ 25న ఇదంతా మోసంగా సీబీఐ తేల్చింది.
2009-2013 మధ్యలో కార్పొరేట్ పవర్ కంపెనీ అక్రమమైన ప్రాజెక్టు స్టేట్మెంట్లతో బ్యాంకు నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నిధుల్ని వివిధ కంపెనీలు, డమ్మీ ఎక్కౌంట్లకు మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ కంపెనీలో ప్రొమోటర్లు, డైరెక్టర్లుగా ఉన్న మనోజ్ జైశ్వాల్, అభిషేక్ జైశ్వాల్, అభిజీత్ జైశ్వాల్, రాజీవ్ కుమార్, బిషాల్ జైశ్వాల్, మున్నా కుమార్ జైశ్వార్, పీఎల్ కిృష్ణన్, రాజీవ్ గోయల్, అరుణ్ కుమార్ శ్రీవాస్తవ, ఎస్ఎన్ గైక్వాడ్, ప్రేమ్ ప్రకాష్ శర్మ, అరుణ్ గుప్తలు నిందితులుగా ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook