Toll Tax: టోల్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

Toll Plaza New Rules: హైవేలో టోల్‌ ప్లాజాల వద్ద కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే వాహనదారుల ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 09:06 AM IST
Toll Tax: టోల్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

Toll Plaza New Rules: వాహదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. 2024లోపు దేశంలో 26 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని.. టోల్‌ ట్యాక్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలను కూడా జారీ చేస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తర్వాత.. రోడ్ల విషయంలో మన దేశం కూడా అమెరికాతో సమానంగా మారుతుందన్నారు. దీంతో పాటు టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి నింబంధనలు, సాంకేతికతలో కీలక మార్పులు ఉంటాయని ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

రాబోయే రోజుల్లో టోల్ ట్యాక్స్ రికవరీ కోసం ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇవ్వాలని యోచిస్తోంది. మొదటి ఆప్షన్ కార్లలో జీపీఎస్ వ్యవస్థను అమర్చాలని చూస్తోంది. రెండవ పద్ధతి ఆధునిక నంబర్ ప్లేట్‌కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. 

ప్రస్తుతం టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధనలు లేవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో పాటు రానున్న రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలుకు టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటివరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని.. అయితే టోల్‌కు సంబంధించిన బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 

టోల్ ట్యాక్స్‌ను నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి తొలగించేలా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు ఏం తీసుకోకూడదని కేంద్ర అనుకుంటోంది. ఇకపై టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని.. ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి కట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని నితిన్‌ గడ్కరీ చెప్పారు. 2019లో కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్‌లతో కార్లు వస్తాయని చెప్పామని అన్నారు. అందుకే గత నాలుగేళ్లుగా వచ్చిన వాహనాలకు వేరే నెంబర్ ప్లేట్లు ఉన్నాయన్నారు. 

నూతన నిబంధనలు అమలులోకి వస్తే ప్రతి చోట వాహనం ఆపి టోల్ ట్యాక్స్ ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. కార్లకు జీపీఎస్ ఫిక్స్ చేస్తే.. మన కారు హైవే ఎక్కగానే టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభమవుతుంది. మనం హైవేపై ఎంత దూరం ప్రయాణించామో అంతవరకు లెక్కేసి ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది.

Also Read: IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..  

Also Read: Jammu Kashmir Crime: మరో దారుణ ఘటన.. మహిళను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన నిందితుడు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News