ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదం

ఈ రోజు ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆమోదం పొందాల్సి ఉంది. 

Last Updated : Dec 15, 2017, 04:30 PM IST
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదం

ఈ రోజు ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆమోదం పొందాల్సి ఉంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2017కు గానీ ఆమోదం లభిస్తే, మూడు సార్లు తలాక్ అని చెప్పి భర్త విడాకులు ఇవ్వడం కుదరదు. ఒకవేళ అలా చేస్తే.. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే భర్త చేసిన నేరానికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తారు. 

అలాగే బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో పాటు మాజీ భర్త నుండి జీవనభృతిను కూడా అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ బిల్లుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో.. ముస్లిం ప్రముఖులు చాలామంది ఈ అంశంపై చర్చ జరగాలని కోరుతున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే దేశంలోని రాష్ట్రాలన్నీ తెలియజేయవచ్చని చెబుతూ.. ఈ నెల 10 వరకు ప్రభుత్వం గడువును ఇచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతూ అసోం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కేంద్రానికి తమ స్పందనను తెలిపాయి.

Trending News