మోడీ Vs బాబు: ఇక జాతీయ స్థాయి మహాకూటమిపై చంద్రబాబు దృష్టి

మోడీ సర్కార్ పై సమర శంఖం పూరించిన చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ నినాదంతో ఈ రోజు బీజేపీ వ్యతిరేక పక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

Last Updated : Dec 10, 2018, 01:43 PM IST
మోడీ Vs బాబు: ఇక జాతీయ స్థాయి మహాకూటమిపై చంద్రబాబు దృష్టి

తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి మహాకూటమిపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఈ రోజు బీజేపీని వ్యతిరేకించే అన్ని పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లినట్లయితే  మధ్యాహ్నం బీజేపేతర పక్షాలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బీజేపీని వ్యతిరేకించే 14 ప్రధాన పార్టీలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ భేటీకి కాంగ్రెస్ తరఫున రాహుల్, సోనియా, ఎస్పీ తరఫున ములాయం సింగ్ , జేడీయూ తరఫున దేవేగౌడ, డీఎంకే తరఫున స్టాలిన్ , తృణమూల్ తరఫున మమత ఈ భేటీలో పాల్గొంటున్నట్లు తెలిసింది.

భవిష్యత్ కార్యచరణ ఖరారు

పార్లమెంట్ అలోక్ భవనంలో జరనున్న ఈ భేటీ ఈ రోజు మధ్యాహ్నం 3:30కి ప్రారంభం కానుంది. ఈ భేటీలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ మహాకూటమి భవిష్యత్తు కార్యచరణ ఖరారు చేస్తారు.అలాగే ఈ భేటీలో మహాకూటమి రూపం దాల్చే అవకాశముంది. కూటమికి కన్వీకన్, కో ఆర్డినేటర్లు తదితర అంశాల్లో కాంగ్రెస్ తో పాటు భాగస్వామ్య పక్షాలకు సమాన ప్రాధాన్యత ఇస్తారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం.

ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ

కాగా ఈ భేటీలో రాఫెల్ కుంభకోణం, నోట్ల రద్దుతో జనాలు పడ్డ అవస్థలు, జీఎస్ టీ అమలు వైఫల్యం, చిన్నాభిన్నమైన ఆర్ధివ్యవస్థ , నీరుగారిన రాజ్యంగబద్ధ సంస్థలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. మరోవైపు 5 రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తాయని మహాకూటమి సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Trending News