Child Berth in Train: భారతీయ రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. రోజులో చాలామంది సీటు లేకుండానే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో దివ్యాంగులు, చిన్నారులు, పిల్లతల్లులు, గర్భిణీలు ప్రయాణించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు చంటిబిడ్డల తల్లులు విశ్రాంతి తీసుకునేందుకు రైల్లో బెడ్ కూడా సరిపోవం లేదు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. తల్లీదండ్రులతో పాటు బిడ్డ కూడా పడుకునేందుకు వీలుగా ఓ చిన్న బెడ్ ను ఏర్పాటు చేసింది. దీంతో చిన్నారులు హాయిగా నిద్రించేందుకు వీలు కలుగుతుంది.
Facilitating ease of travel for mothers travelling with their babies.
Indian Railways introduced baby berth on experimental basis in Lucknow Mail 12229/30, Coach No. 194129/B4, berth No. 12 & 60.
The fitted baby berth is foldable & secured with a stopper. pic.twitter.com/THZvL4MJhk— Ministry of Railways (@RailMinIndia) May 10, 2022
తొలుత ఈ సదుపాయాన్ని లక్నో - ఢిల్లీ మధ్య నడిచే రైలులో ప్రవేశపెట్టారు. థర్డ్ క్లాస్ ఏసీ క్లాస్‌లో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. 'బేబీ బెర్త్' పేరిట ప్రవేశపెట్టిన ఈ బెడ్ ను అవసరం లేదంటే మడతపెట్టవచ్చు. రైల్లో ప్రవేశపెట్టిన ఈ 'బేబీ బెర్త్' పొడవు 770 మి.మీ.. 255 మి.మీ వెడల్పును కలిగి ఉంది. ఈ సదుపాయం పట్ల పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
ALso Read: Amithsha Book On Modi: దేశానికి మరో 25 ఏళ్లు మోడీనే ప్రధాని.. అమిత్ షా పుస్తకంలో అన్ని సంచలనాలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.