Former Union Minister Dilip Ray gets 3-year imprisonment: న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం (Coal block scam) కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే ( Dilip Ray ) తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ఈ మేరకు మూడేళ్ల శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తీర్పును వెలువరించారు. దీంతోపాటు క్యాస్ట్రన్ టెక్‌కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌కు మరో 10లక్షల జరిమానాను విధించారు. సీబీఐ (CBI) తోపాటు, నిందితుల వాదనలు విన్న ధర్మాసనం 1999లో జార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు.. నిర్థారించి మాజీ మంత్రి దిలీప్ రేను ఈ నెల ఆరున దోషిగా తేల్చింది. అనంతరం ఈ కేసును అక్టోబరు 26కు వాయిదా వేస్తూ.. మాజీ మంత్రి హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ధర్మాసనం ఈ రోజు తీర్పును వెలువరించింది. Also read: Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్
అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ఎన్డీఏ ప్రభుత్వంలో దిలీప్ రే ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ బొగ్గు కుంభకోణంలో దిలీప్ రేతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యనంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (CTL) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వల్లాకు కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించాలని సీబీఐ కోర్టును కోరింది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్ (Coal scam) ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్‌కు కేటాయించారని తేలడంతో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe