ధన్ధుకా: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని (డిసెంబర్ 6) స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ "కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకూ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వలేదు. సర్దార్ పటేల్ విషయంలో కూడా అన్యాయం చేసింది. ఒక కుటుంబం (గాంధీ-నెహ్రూ కుటుంబం) బాగుకోసం ఎన్నోసార్లు కుట్రలు చేసింది. నెహ్రూ ప్రభావం కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ రాజ్యాంగ సభలో అంబేద్కర్ ను లేకుండా చేయడానికి ప్రయత్నించింది" అని అన్నారు.
"బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలని ఆసక్తిగా ఉండేవారు. ఆయన విజన్ లో భాగమే భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ" అని మోదీ అన్నారు.
డిసెంబరు 6, 1956న మరణించిన బి.ఆర్.అంబేద్కర్ ఒక న్యాయవాది, ఆర్ధికవేత్త, రాజకీయవేత్త. దళితులు, మహిళలు మరియు కార్మికుల సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశాడు.ఆయన స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయ మంత్రి మరియు భారత రాజ్యాంగ రూపశిల్పి. 1990లో అంబేద్కర్ మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రదానం చేశారు.