Corona Second Wave: దేశంలో ప్రమాదకర స్థాయిలో కరోనా ఉధృతి, 24 గంటల్లో 3.5 లక్షల కేసులు

Corona Second Wave: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పెను రక్కసిలా వ్యాపిస్తోంది. దేశ ప్రజానీకం వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2021, 11:15 AM IST
Corona Second Wave: దేశంలో ప్రమాదకర స్థాయిలో కరోనా ఉధృతి,  24 గంటల్లో 3.5 లక్షల కేసులు

Corona Second Wave: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పెను రక్కసిలా వ్యాపిస్తోంది. దేశ ప్రజానీకం వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ (Corona Second Wave) విరుచుకుపడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ప్రజల్ని వణికిస్తోంది. ఏ రోజుకారోజు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. మొన్నటి వరకూ రోజుకు 2 లక్షలు దాటి నమోదైన కేసులు గత 3-4 రోజుల్ని 3 లక్షలు దాటి నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు నమోదవుతున్న కేసులు..ఒకప్పటి అమెరికా కేసుల సంఖ్యను దాటేశాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే అత్యదికంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. వరుసగా మూడవ రోజు కూడా ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. 

గత 24 గంటల్లో ఇండియాలో 3 లక్షల 46 వేల 786 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు వరుసగా నాలుగవరోజు కరోనా వైరస్( Coronavirus) మరణాల సంఖ్య 2 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 వేల 624 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 25 లక్షల 52 వేల 940 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 2 లక్షల 19 వేల 838 మంది బాదితులు కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో 1 కోటి 66 లక్షల 10 వేల 481 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు కోలుకున్నవారి సంఖ్య దేశంలో ఇప్పటివరకూ 1 కోటి 38 లక్షల 67 వేల 997గా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకూ 1 లక్షా 89 వేల 544 మంది మరణించారు. ఇండియాలో ఇప్పటివరకూ 13 కోట్ల 83 లక్షల 79 వేల 832 మందికి వ్యాక్సినేషన్ ( Corona Vaccination) అందించారు.

Also read: Maharashtra fire accident: మహారాష్ట్ర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 14 మంది రోగులు సజీవ దహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News