Corona Updates in India: గడిచిన 24 గంటల్లో 5.19 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 వేల 847 మందికి కరోనా సోకినట్లు తేల్చారు. కరోనా పాజిటివిటీ రేటు సైతం రెండు శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్రలో 4 వేల 255, కేరళలో 3 వేల 419, కర్ణాటకలో 833 కేసులు బయట పడ్డాయి. తమిళనాడు, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి వైరస్ సోకింది. కరోనా నుంచి 7 వేల 958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.64 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 14 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 10 రోజులుగా అక్కడ 7 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. మొన్నటి వరకు 1.92 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 7.01 శాతానికి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 63 వేల 063గా ఉంది.
ఇటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15.27 లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 195.8 కోట్ల మందికి పైగా డోసులు అందించారు.
#COVID19 | India reports 12,847 new cases, 14 deaths & 7,985 recoveries, in the last 24 hours.
Active cases 63,063
Daily positivity rate 2.47% pic.twitter.com/C6pPVVarcW— ANI (@ANI) June 17, 2022
Also read: AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు..మీ కోసం కీలక సూచనలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook