Coronavirus updates: దేశంలో కాస్త తగ్గిన కోవిడ్‌ కేసులు, 166 మంది మృతి

Coronavirus, Covid-19 cases updates: దేశంలో 9,23,003 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 12:09 PM IST
  • దేశంలో మళ్లీ కాస్త అదుపులోకి వచ్చిన కరోనా
  • కాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు
  • తాజాగా 15,981 మందికి కోవిడ్‌ పాజిటివ్‌
Coronavirus updates: దేశంలో కాస్త తగ్గిన కోవిడ్‌ కేసులు, 166 మంది మృతి

Coronavirus live updates: India reports 15,981 new cases and 166 deaths in 24 hours, govt says: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. యాక్టివ్‌ కేసులు (Active‌ cases) 217 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. శనివారానికి సంబంధించిన కోవిడ్‌ కేసుల (Covid-19 cases) వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దసరా సందర్భంగా కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు (covid‌ tests) తగ్గాయి. తాజాగా దేశంలో 9,23,003 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (covid‌ Positive‌) నిర్ధారణ అయ్యింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 17,861 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. అయితే నిన్న మరో 166 మంది కరోనా (Corona) వల్ల ప్రాణాలు కోల్పోయారు. 

Also Read : IPL 2021 Title Winner: ఐపీఎల్ టైటిల్ అర్హత ఆ జట్టుకే ఉంది, ధోనీ సంచలన వ్యాఖ్యలు

గతేడాది ప్రారంభం నుంచి 3.40 కోట్ల మందికిపైగా వైరస్ కోవిడ్‌ బారినపడ్డారు. అందులో 3.33కోట్ల(98.08 శాతం) మందికి పైగా కరోనా (Corona) నుంచి కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు (Active‌ cases) రెండు లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల 4,51,980 మంది ప్రాణాలు వదిలారు. 

ఇక నిన్న సెలవు రోజు కావడంతో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ (Vaccination‌) కూడా నెమ్మదించింది. నిన్న 8.36 లక్షల మందికి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో మొత్తంగా పంపిణీ అయిన కోవిడ్‌ (covid‌) డోసుల సంఖ్య 97,23,77,045కి చేరింది.

Also Read : CWC Meeting: కాంగ్రెస్‌ కీలక భేటీ ప్రారంభం.. కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News