Corona second wave: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ పెరుగుతున్నట్టే కన్నడ నాట కోరలు చాస్తోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతుండటంతో విధించిన నైట్ కర్ఫ్యూపై సందేహాలు వస్తున్నాయి. పగలు వదిలేసి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే లాభమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్‌లతో పాటుగా కర్నాటక(Karnataka)లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కన్నడ నాట కోవిడ్ 19 రెండవ దాడి భయంకరంగా ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 8 వేల 778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటు 6 వేల 79 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 67 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 10.83 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా..9.92 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 13 వేల 8కు పెరిగింది.
కోవిడ్ 19 దాడి నేపధ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని బెంగళూరు( Bengaluru), తుంకూరు, బీదర్, మైసూరు( Mysore), బెళగావి వంటి 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ(NIght Curfew)మూడ్రోజుల్నించి అమల్లో ఉంది. రాత్రి పూట ఎవరరూ బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లను పెట్టి పహారా కాస్తున్నారు. మార్కెట్‌లో పని లేకున్నా ఇంటి నుంచి బయటకు వచ్చేవారిపై లాఠీలు ఝులిపిస్తున్నారు. అయితే పగటిపూట మాత్రం యధావిధిగా పూర్తి రద్గీ ఉంటోంది.బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. పగలు విచ్చలవిడిగా వదిలేసి...రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే లాభమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ వల్ల ప్రయోజనం లేదని నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.29 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid 19 tests) చేశారు. కొత్తగా 1.21 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 9 వేల 195 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 60.77 లక్షల మందికి వ్యాక్సినేషన్( Corona vaccination)వేశారు.
Also read: Lockdown again: కర్ణాటకలో మాట వినకపోతే లాక్‌డౌన్ తప్పదని హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook