Cowin Portal: కోవిన్ పోర్టల్ ఇకపై 14 ప్రాంతీయ భాషల్లో

Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2021, 12:51 PM IST
Cowin Portal: కోవిన్ పోర్టల్ ఇకపై 14 ప్రాంతీయ భాషల్లో

Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.

కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) నేపధ్యంలో ప్రజలకు చేరువైన కోవిన్ పోర్టల్ (Cowin Portal) హిందీ సహా మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్ 19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు 17 లేబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పరిస్థితిపై జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వివిధ కోవిడ్ వేరియంట్లను త్వరితగతిన గుర్తించేందుకు ఈ లేబొరేటరీలు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతానికి దేశంలో ఈ తరహా ల్యాబొరేటరీలు పది ఉన్నాయి.

కోవిడ్ 19 చికిత్సలో ఎక్కువగా వాడుతున్న ఔషధాలు ముఖ్యంగా రెమ్‌డెసివిర్(Remdesivir), టోసిలిజుమాబ్, అంఫొటెరిసిన్-బి ఉత్పత్తి, కేటాయింపుల మద్య సమన్వయం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి..నెలకు 39 లక్షల వయల్స్ నుంచి 1.18 కోట్ల వయల్స్ వరకూ తయారవుతున్నాయి. అదే విధంగా బ్లాక్ ఫంగస్ బారినపడినవారికిచ్చే అంఫోటెరిసిన్ -బి ఔషధం తయారీ పెరిగిందన్నారు. మే నెల 1 -14 మధ్యలో రాష్ట్రాలకు లక్ష వరకూ అంఫోటెరిసిన్-బిను అందించినట్టు ఫార్మా సెక్రటరీ అపర్ణ తెలిపారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షల్ని పెంచేందుకు ఆర్టీపీసీఆర్(RTPCR), ఆర్‌ఏటీ టెస్ట్ కిట్లను అందుబాటులో తీసుకొస్తున్నట్టు ఐసీఎంఆర్(ICMR) ఛీప్ డాక్టర్ బలరాం భార్గవ్ తెలిపారు.హోం ఐసోలేషన్ మార్గదర్శకాల్ని హిందీతో పాటు 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో తీసుకురానున్నారు.

Also read: Kerala Assembly: కేరళ ముఖ్యమంత్రిగా ఈనెల 20న రెండవసారి పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News