Manohar Lal Khattar Resigns AS Haryana CM: దేశంలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అనేక ఆసక్తికరపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలో సీఏఏ చట్టం అమలు హట్ టాపిక్ గా మారింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఎస్పీఐ బాండ్ల విషయంలో వివాదం కాస్త పీక్స్ కు చేరింది. దీనిపై ఎస్పీఐ వైఖరీరి సుప్రీం ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఇదిలా ఉండగా.. తాజాగా, హర్యానా ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఈరోజు కలిసి తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు.
Read More: CAA Implementaion: మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయం.. సంచలన ప్రకటన చేసిన ముఖ్యమంత్రి..
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి మండలి సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల పంపకాల ఒప్పందాలపై అధికార కూటమిలో చీలిక వస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ క్రమంలో.. సీఎం ఖట్టర్, తన క్యాబినెట్ తో పాటు రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా.. హర్యానాలో 90 స్థానాలు ఉన్నాయి. దీనిలో బీజేపీ 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో.. ఎన్నికల అనంతరం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter