CSIR UGC NET 2020 Results: యూజీసీ నెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి

CSIR UGC NET 2020 Results: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాలు ntaresults.nic.inలో చెక్  చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

Last Updated : Dec 29, 2020, 12:57 PM IST
  • యూజీసీ నెట్ జూన్ 2020 ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టీఏ
  • నవంబర్ 19, 21, 26 తేదీలలో నెట్ 2020 నిర్వహించారు
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవాలన్న ఎన్‌టీఏ
CSIR UGC NET 2020 Results: యూజీసీ నెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి

CSIR UGC NET JUNE 2020 Results | కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2020 ఫలితాలు (CSIR UGC NET Results 2020)ను మంగళవారం నాడు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్  చేసుకోవాలని యూజీసీ నెట్‌ రాసిన అభ్యర్థులకు ఎన్‌టీఏ సూచించింది. 

యూజీసీ నెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
 

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ 2020 (UGC NET June 2020) పరీక్షను నవంబర్ 19, 21, 26 తేదీలలో నిర్వహించడం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 225 పట్టణాలలో 569 పరీక్షా కేంద్రాలలో యూజీసీ నెట్ జూన్ 2020 నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలతో నెట్ 2020ను జాగ్రత్తల నడుమ జరిగింది. మొత్తం 1,71,273 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Also Read: Bank Jobs 2020: రాత ప‌రీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది

కాగా, కాలేజీలు, యూనివర్సిటీలలో, వాటి అనుబంధ కాలేజీలలో లెక్చరర్ పోస్టులు కోసం, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అర్హత సాధించడానికి అభ్యర్థుల కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (CSIR), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) సంయుక్తంగా నెట్ పరీక్ష నిర్వహిస్తాయి. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలలలో మొత్తం రెండు పర్యాయాలు పరీక్ష నిర్వహిస్తారని తెలిసిందే.

Also Read: Hyderabad Jobs: హైదరాబాద్‌ ఎంఎస్ఎంఈలో జాబ్స్.. అప్లై చేసుకున్నారా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News