Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్..!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయుగండం తప్పలేదు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తాజా వాతావరణ శాఖ సూచనలను ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 20, 2022, 03:34 PM IST
  • తెలుగు రాష్ట్రాలకు వాయుగండం
  • మరోమారు వర్ష సూచన
  • అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్..!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. నిన్నటి తీవ్ర వాయుగుండం..పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తర మధ్యప్రదేశ్‌ వైపు వెళ్తోంది. ఈక్రమంగా వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈక్రమంలో కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి.  రాగల మూడు రోజులపాటు తెలంగాణలో తేలికా పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉంది. ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 

వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ వైపు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల వానలు పడనున్నాయి. దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు , ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాయలసీమలోనూ చిరుజల్లులు పడుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట పెనుగాలులు ఉండనున్నాయి. గంటలకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల బ్రిడ్జ్‌లు దెబ్బతిన్నాయి. వరద ధాటికి పిల్లర్లు కొట్టుకుపోయాయి. ఈనెల 25 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also read:KCR Munugode Meeting Live Updates: కాసేపట్లో మునుగోడు బహిరంగసభకు సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ కు సీపీఐ సపోర్ట్    

Also read:Heavy Rains: ఉత్తరాధిలో జల విలయం..కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News