కోర్టులు డ్రామా చూస్తున్నాయి: నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం వెనక వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించింది. నిర్భయ తల్లి ఆశా దేవి సోమవారం మాట్లాడుతూ.. ఇది మన వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని చూపిస్తుందని, 

Last Updated : Mar 2, 2020, 09:40 PM IST
కోర్టులు డ్రామా చూస్తున్నాయి: నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం వెనక వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించింది. నిర్భయ తల్లి ఆశా దేవి సోమవారం మాట్లాడుతూ.. ఇది మన వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని చూపిస్తుందని, భారతదేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతుందో ప్రపంచం మొత్తం చూస్తోందని ఆమె విలేకరులతో అన్నారు.

కాగా నలుగురు దోషుల ఉరి వాయిదా వేయడం ఇది మూడోసారని, నిర్భయ తల్లి ఆశా దేవి పేర్కొంటూ రోజు రోజుకు కోర్టులపై నమ్మకం పోతోందని ఆమె అన్నారు. కానీ ఆ నలుగురి దోషులకు ఉరి శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. తాము ఒకవైపు న్యాయం కోసం పోరాడుతుంటే కోర్టులు డ్రామాలు చూస్తున్నాయని మండిపడ్డారు. 

2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురి దోషులకు మార్చి3న మంగళవారం ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష ప్రక్రియ జరగాల్సి ఉండగా మరోసారి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు తెలిపింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News