Delhi Air pollution: దిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు మూసివేత!

Delhi Air pollution: దిల్లీ ప్రభుత్వం తిరిగి స్కూళ్లు తెరవడంపై ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర జేసింది. ఈ నేపథ్యంలో.. పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 06:19 PM IST
Delhi Air pollution: దిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు మూసివేత!

Delhi Air Crisis: దిల్లీలో శుక్రవారం(Friday) నుంచి పాఠశాలలు(Schools) మూసివేయన్నారు. వాయు కాలుష్య సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్కూల్స్(Schools) ను మూసివేయనున్నట్లు దిల్లీ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్(Minister Gopal Rai) వెల్లడించారు. 

కాలుష్యం(Pollution) వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో...తిరిగి స్కూళ్లు తెరవడంపై దిల్లీ ప్రభుత్వం(Delhi Government)పై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా ఉద్యోగులకే వర్క్​ ఫ్రం హోం ఇచ్చినప్పుడు.. పసి పిల్లలను పాఠశాలలకు రమ్మనడం ఏమిటని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ప్రశ్నించింది. ఈ క్రమంలోనే దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కాలుష్య పరిస్థితుల కారణంగా పది రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలు సోమవారం నుంచే నడుస్తున్నాయి. ఇప్పుడు వాటికి మళ్లీ బ్రేక్ పడింది. 

Also Read: Delhi Air pollution: ఢిల్లీ కాలుష్య నియంత్రణపై సుప్రీం అసంతృప్తి- కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి వార్నింగ్​

''‘గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణలోకి తీసుకొని మేం పాఠశాలలు తెరిచాం. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేయాలని నిర్ణయించాం'    -దిల్లీ మంత్రి గోపాల్ రాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News