Delhi Lockdown: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో లాక్‌డౌన్ విధించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్ (Corona Second Wave) అత్యంత ప్రమాదకరంగా మారింది. సంక్రమణ వేగం అత్యధికంగా ఉంది. దేశంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 24 వేల కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధించాలనే విజ్ఞప్తులు ఎక్కువవుతున్నాయి.
ఢిల్లీలో పెరుగుతున్న కేసుల పట్ల ట్రేడర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ఇప్పటికీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) లేఖ రాసింది. కరోనా సంక్రమణ ఛైన్‌ను అరికట్టాలంటే కనీసం 15 రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ ( Lockdown in Delhi )విధించాలని లేఖలో కోరింది. అదేవిధంగా ఢిల్లీకి చేరుకునే అన్నిరకాల మార్గాలను మూసివేయాలని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ లేఖలో కోరింది. అయితే, కోవిడ్ విజృంభన వలన ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందా అనేది అనుమానాస్పదంగానే మారింది.
Also read: Oxygen Shortage: ఆక్సిజన్ కొరతతో మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి, మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook