ED TARGET KCR: ఈడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా దినేష్.. కేసీఆర్ కు ఉచ్చు బిగిసినట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది..

ED TARGET KCR: తెలంగాణలో  అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. మోడీ-షా టీమ్ ఏదైనా రాష్ట్రంపై ఫోకస్ చేస్తే.. అక్కడ పూర్తిస్థాయిలో యాక్షన్ ఉంటుంది. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారంటున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 1, 2022, 08:19 AM IST
  • ఈడీ ఆడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా దినేష్
  • తెలంగాణ బాధ్యతలు అప్పగించే ఛాన్స్
  • సీఎం కేసీఆరే టార్గెట్టా?
ED TARGET KCR: ఈడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా దినేష్.. కేసీఆర్ కు ఉచ్చు బిగిసినట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది..

ED TARGET KCR:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి సామ్రాట్టుగా మారిపోయారు.. ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెబుతున్నారు. ఇతర బీజేపీ నేతలు కూడా పదేపదే కేసీఆర్ కు జైలుకు వెళతారనే ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా కేసీఆర్ పై అవినీతిపై మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలోనే కేసీఆర్ అవినీతిని బహిర్గతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆ ప్రకటన తర్వాత నుంచి కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈడీ స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయని.. కేసీఆర్ సర్కార్ అవినీతికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. తాజాగా మరో కీలక పరిణామం జరిగింది.

తెలంగాణపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ టీమ్ లు తెలంగాణలో మకాం వేశాయనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా ఈడీకి కొత్తగా అడిషనల్ డైరెక్టర్ ను నియమించింది కేంద్రం. ఐఆర్ఎస్ అధికారి దినేష్ ప‌రుచూరి ఎన్‌ ఫోర్స్‌మెంట్ ఆడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా నియమితులయ్యారు.  2009 సంవ‌త్స‌రం బ్యాచ్ అధికారి అయిన దినేష్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పని చేశారు. తాజాగా దినేష్ ను ఈడీ అడిషనల్ డైరెక్టర్ గా తీసుకున్నారు. దినేష్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గానే దినేష్ ను ఈడీలో కీలక పదవి అప్పగించారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. సూపర్ ఆఫీసర్ గా పేరున్న దినేష్ ఎంట్రీతో తెలంగాణలో సంచలన పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణలో  అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. మోడీ-షా టీమ్ ఏదైనా రాష్ట్రంపై ఫోకస్ చేస్తే.. అక్కడ పూర్తిస్థాయిలో యాక్షన్ ఉంటుంది. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఇలాగే దెబ్బకొట్టారు. చంద్రబాబు తరహాలోనే కేసీఆర్ ను అష్ట దిగ్భందనం చేసేందుకు కమలనాథులు స్కెచ్ వేశారంటున్నారు. కేంద్రం పెద్దల డైరెక్షన్ లోనే ఈడీ టీమ్ లు తెలంగాణలో తిరుగుతున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలపై ఈడీ నిఘా పెట్టిందని తెలుస్తోంది. అనుమానిత లావాదేవీలపై ప్రశ్నిస్తోంది. ఈటీ యాక్షన్ తో గతంలో కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారని అంటున్నారు. కేసీఆర్ కు ఆర్థికంగా అండగా ఉండేవారిపై నిఘా పెట్టడంతో గత ఎనిమిది ఏళ్లుగా జరిగిన అవినీతిపైనా ఈడీ ఆరా తీస్తుందని చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉచ్చు బిగిసేలా కేంద్రం అన్ని అస్త్రాలు బయటికి తీస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే కొత్తగా అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ ను అపాయింట్ చేశారనే టాక్ వస్తోంది. దినేష్ నియామకం సీఎం కేసీఆర్ టార్గెట్ గానే అయి ఉంటుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా త్వరలోనే సంచలనం జరగబోతుందని.. కేసీఆర్ కు చుక్కలు కనిపించబోతున్నాయని అంతర్గత చర్చల్లో చెబుతూ వస్తున్నారు. వాళ్ల మాటలకు అనుగుణంగానే పరిణామాలు జరుగుతుండటంతో.. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కేంద్రంగా సంచలన పరిణామాలు జరగబోతున్నాయనే చర్చ సాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ప్రశ్నించింది. మహారాష్ట్రలో  శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ను అదుపులోనికి తీసుకుంది. దీంతో హెదరాబాద్ లో ఈడీ ఏం చేయబోతుందో... ఎవరిని కటకటాల్లోకి పంపిస్తోందో... చూడాలి మరీ..

Read also: Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. పోలీసుల హై అలర్ట్

Read also: Telangana Rains: తెలంగాణకు ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన..పిడుగులు పడే ప్రాంతాలు ఇవే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News