Farmers protest: నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల సమ్మె కొనసాగుతోంది. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఇంకోసారి భేటీ అయ్యేందుకు నిర్ణయమైంది.
కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల్ని( New Agriculture acts ) వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Borders ) అన్నదాతలు సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే భారత్ బంద్, రహదార్ల దిగ్భంధం వంటి కార్యక్రమాలు చేశారు. రైతుల సమ్మె ( Farmers protest ) ను విరమించేందుకు రంగంలో దిగిన కేంద్రం పలు దఫాలుగా రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది.
ఇవాళ మరోసారి రైతు సంఘాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ( Union minister narendrasingh tomar ) చర్చలు జరిపారు. దాదాపు 5 గంటలకు పైగా చర్చ సాగినా..ఎటువంటి అంశాలు కొలిక్కి రాలేదు. జనవరి 4వ తేదీన మరోసారి భేటీ అయ్యేందుకు నిర్ణయించారు. కనీస మద్దతు ధర విషయంలో కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలించనుంది. వాయు కాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణతో పాటు విద్యుత్ బిల్లులో సవరణలకు కేంద్రం మొగ్గు చూపించింది. అయితే రైతుల ప్రధాన డిమాండ్ అయిన మూడు కొత్త చట్టాల్ని రద్దు చేయడం, కనీస మద్దతు ధర ( MSP ) పై చట్టం అంశాల్ని కేంద్రం అంగీకరించలేదు.
రెండు అంశాలపై రైతు సంఘాలతో ( Farmer unions ) అంగీకారానికి వచ్చామని..రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. కొత్త చట్టాలపై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. అటు రైతు సంఘాల ప్రతినిధులు కూడా చర్చలు కాస్త సానుకూల ధోరణిలోనే కొనసాగాయని చెప్పడం గమనార్హం.
Also read: Union cabinet: కృష్ణపట్నం సహా మూడు పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం ఆమోదం